నేటి డిజిటల్ కాలంలో ఆధార్ కార్డు లేనిదే ఏ పనీ జరగదు. బ్యాంకింగ్ నుంచి ప్రభుత్వ పథకాల వరకు ప్రతిదానికి 12 అంకెల ఈ విశిష్ట సంఖ్య కీలకం. అయితే, కార్డు పోగొట్టుకోవడం లేదా మొబైల్ నంబర్ అప్‌డేట్ కోసం ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగడం వంటి సమస్యలకు చెక్ పెడుతూ.. UIDAI జనవరి 28, 2026 న సరికొత్త ఫీచర్లతో కూడిన ఆధార్ యాప్‌ను పూర్తిస్థాయిలో లాంచ్ చేసింది.
Read also: Payment App: ఐఫోన్ యూజర్లకు శుభవార్త: ఆపిల్ పే త్వరలో

ఈ కొత్త యాప్‌లో ఉన్న నెక్స్ట్ లెవల్ ఫీచర్లు ఇవే:
- ఫేస్ అథెంటికేషన్‌తో మొబైల్ నంబర్ మార్పు: ఇకపై మొబైల్ నంబర్ అప్‌డేట్ కోసం క్యూలో నిలబడాల్సిన పనిలేదు. కేవలం మీ ముఖాన్ని స్కాన్ (Face Authentication) చేయడం ద్వారా ఇంటి నుంచే నంబర్‌ను మార్చుకోవచ్చు.
- సెలెక్టివ్ షేరింగ్ (Selective Share): ఆధార్ జిరాక్స్ ఇస్తే పూర్తి వివరాలు తెలిసిపోతాయనే భయం అక్కర్లేదు. ఈ ఫీచర్ ద్వారా మీకు అవసరమైన వివరాలను మాత్రమే అవతలి వ్యక్తితో పంచుకునే వీలుంటుంది. ఇది మీ ప్రైవసీని మరింత భద్రపరుస్తుంది.
- ఫ్యామిలీ ప్రొఫైల్స్: మీ స్మార్ట్‌ఫోన్‌లోనే మీ కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను కూడా సేవ్ చేసుకోవచ్చు. ప్రయాణాల్లో అందరి ఫిజికల్ కార్డులు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.
- బయోమెట్రిక్ లాక్: సైబర్ నేరాలు పెరిగిపోతున్న తరుణంలో, మీ వేలిముద్రలు దుర్వినియోగం కాకుండా యాప్ ద్వారా సులభంగా లాక్ లేదా అన్‌లాక్ చేసుకోవచ్చు.
- ఆఫ్‌లైన్ వెరిఫికేషన్: ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాల్లో కూడా మీ గుర్తింపును నిరూపించుకోవడానికి ఈ యాప్ సహకరిస్తుంది.
పాన్-ఆధార్ లింకింగ్ సింపుల్ ప్రాసెస్:
ఆదాయపు పన్ను రిటర్న్స్ లేదా ఇతర సేవల కోసం ఆధార్‌ను పాన్‌తో లింక్ చేయడం ఇప్పుడు తప్పనిసరి.
- ఇన్కమ్ టాక్స్ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ‘Link Aadhaar’ పై క్లిక్ చేయండి.
- పాన్ మరియు ఆధార్ నంబర్లు నమోదు చేసి ‘Validate’ బటన్ నొక్కండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని ఎంటర్ చేస్తే లింకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.
ఈ కొత్త అప్‌డేట్‌తో ఆధార్ వినియోగం మరింత స్మార్ట్‌గా, సురక్షితంగా మారింది. మీ ఐడెంటిటీని భద్రంగా ఉంచుకోవడానికి వెంటనే ఈ సరికొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: