మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) మరోసారి వినూత్న ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడుతున్న ఈ యాప్ (WhatsApp)లో ఇప్పుడు కమ్యూనికేషన్‌ను మరింత సులభతరం చేసే రెండు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా కాల్‌లను మిస్ అయ్యే లేదా కాల్ లిఫ్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్న వారికి ఉపయోగపడే విధంగా వాట్సాప్ ఈ ఫీచర్లను రూపొందించింది. ఈ కొత్త అప్‌డేట్‌లు విడుదల కావడంతో యూజర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Amazon: ‘మెగా ఎలక్ట్రానిక్స్ డేస్’ సేల్‌ను ప్రారంభించిన అమెజాన్

కొత్త ఫీచర్
వాట్సాప్ కాల్ రిసీవ్ చేసుకోని వారికి వాయిస్ మెసేజ్ పంపే వెసులుబాటు కల్పించింది. వాయిస్ కాల్ చేస్తే వాయిస్ మెసేజ్, వీడియో కాల్ చేస్తే వీడియో మెసేజ్ పంపించే వన్ టచ్ ఆప్షన్ ప్రవేశపెట్టింది. వాయిస్‌మెయిల్ పేరుతో ఈ ఫీచర్ అందుబాటులో ఉండేది. ఫ్లక్స్, మిడ్ జర్నీల సహకారంతో కొత్త తరహా ఇమేజ్‌లను క్రియేట్ చేసుకునే ఫీచర్ తీసుకొచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: