ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సోషల్ మీడియా లోగోల్లో ట్విట్టర్ బ్లూబర్డ్ ఒకటి. అయితే, 2022 అక్టోబర్‌లో ప్రముఖ వ్యాపార దిగ్గజం, Tesla, SpaceX CEO ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను (ప్రస్తుత X) కొనుగోలు చేసిన తర్వాత సంస్థలో అనేక కీలక మార్పులు తీసుకొచ్చారు. అందులో ముఖ్యమైనది ట్విట్టర్ బ్రాండ్ రీడిజైన్. మస్క్ బ్లూబర్డ్ లోగోను తొలగించి, ‘X’ లోగోతో కొత్త బ్రాండ్‌ను ప్రవేశపెట్టారు. అయితే, మస్క్ తీసుకున్న ఈ నిర్ణయంతో బ్లూబర్డ్ లోగో ఒక చరిత్రలోకి మునిగిపోయింది. కానీ, ఆ లోగో ప్రాముఖ్యత తగ్గలేదు. తాజాగా ఆర్ఆర్ ఆక్షన్ నిర్వహించిన వేలంలో ఈ ఐకానిక్ బ్లూబర్డ్ లోగో భారీ ధరకు అమ్ముడైంది.

ట్విట్టర్ మార్పులు, లోగో తొలగింపు తర్వాత, మస్క్ సాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంలో పాత లోగోలు, ఫర్నీచర్, ఇతర అంసాలను వేలం వేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ బ్లూబర్డ్ లోగో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ బ్లూ కలర్ పక్షి చిహ్నం 12 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పుతో ఉండి, దాదాపు 254 కిలోల బరువును కలిగి ఉంది. ఇంత భారీ డిజైన్ ఉన్నప్పటికీ, వేలంలో దీనిపై తీవ్రమైన ఆసక్తి వ్యక్తమైంది. చివరికి $35,000 (రూ.30 లక్షలు) ధరకు ఈ లోగో అమ్ముడైంది. ఆర్ఆర్ ఆక్షన్ సంస్థ ప్రకారం, బిడ్డింగ్ ప్రక్రియలో అనేక మంది ఆసక్తి చూపారు. అయితే, గెలిచిన వ్యక్తి తన గోప్యత కాపాడాలని అభ్యర్థించడంతో అతని వివరాలను బహిర్గతం చేయలేదు. 2010- ట్విట్టర్‌తన ప్రారంభ దశల్లో ఉండగానే, కంపెనీ తన కొత్త బ్రాండ్ గుర్తింపును పెంపొందించుకోవాలని భావించింది. 2012- ఈ క్రమంలో ‘Larry the Bird’ అనే బ్లూ కలర్ పక్షి ను అధికారిక లోగోగా తీసుకొచ్చారు. 2023- ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను పూర్తిగా X బ్రాండ్‌గా మార్చినప్పుడు, ఈ లోగోను తొలగించారు. ఈ లోగో ఒకటి కాదు, రెండు కాదు, దశాబ్దంపాటు సోషల్ మీడియా చరిత్రలో ఒక ప్రత్యేక గుర్తింపును అందించింది. ప్రజలు ట్విట్టర్ అంటేనే బ్లూ కలర్ పక్షి గుర్తును గుర్తు చేసుకునేలా చేసింది. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత, సంస్థలో ఖర్చులు తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. ఉద్యోగులను తొలగించడం, కొత్త ఫీచర్లు ప్రవేశపెట్టడం, సబ్‌స్క్రిప్షన్ పద్ధతిని మార్పు చేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాదు, సాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయంలో అనేక ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ సామగ్రి, ఫైర్ సేఫ్టీ పరికరాలు, బ్రాండ్ లోగోలు వంటి వస్తువులను వేలం వేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే బ్లూబర్డ్ లోగో కూడా వేలంలో ఉంచారు. ఈ విధంగా మస్క్ కంపెనీకి అదనపు ఆదాయాన్ని సంపాదించుకోవడంతో పాటు, తన కొత్త బ్రాండ్ ‘X’ కోసం బలమైన గుర్తింపును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ట్విట్టర్ఇకపై ‘X’ గా మారినప్పటికీ, బ్లూబర్డ్ లోగోకు ఉన్న ప్రాముఖ్యత ఎప్పటికీ మరిచిపోలేనిది. ఈ లోగోను దక్కించుకున్న వ్యక్తి అభ్యర్థన మేరకు అతని వివరాలను వేలం సంస్థ బయటకు వెల్లడించలేదు.