అమెరికా(America)లో ఓ మహిళా టీచర్.. 15 ఏళ్ల స్టూడెంట్‌తో 50 సార్లు శృంగారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. చికాగో(Chicago)లోని డౌనర్స్ గ్రూవ్ సౌత్ హైస్కూల్‌లో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. విద్యార్థి ఫోన్‌లో టీచర్ నుంచి వచ్చిన అసభ్యకరమైన మెసేజ్‌లు కనడపడంతో అతని తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో ఆ మహిళా టీచర్‌ను అరెస్టు చేసి, స్కూల్ నుంచి తీసివేశారు. నిందితురాలిని మహిళా టీచర్ 30 ఏళ్ల క్రిస్టినా ఫోర్మెల్లా(Christina Foremella)గా గుర్తించారు.
విద్యార్థి ఫోన్ ఆధారంగా కేసు నమోదు
విద్యార్థి ఫోన్‌లో అశ్లీల సందేశాలు చూసి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఆధారంతో క్రిస్టినా(Christina)ను అరెస్ట్ చేసి పాఠశాల నుంచి సస్పెండ్ చేశారు. ఆమెపై లైంగిక దాడి, నేరపూరిత శృంగారం కేసులు నమోదు చేశారు. వీటితో పాటు మరో 52 అభియోగాలు కూడా మోపారు. కేసు విచారణలో భాగంగా ఆ టీచర్ తన భర్తతో కలిసి కోర్టుకు వచ్చింది. ఆమె ఫ్యామిలీ క్రిస్టినాకు అండగా నిలిచింది.

స్టూడెంట్‌తో శృంగారం చేయలేదని క్రిస్టినా కోర్టులో పేర్కొన్నది. బాధిత విద్యార్థికి సుమారు 5000 ఫీట్ల దూరంలో నిందితురాలు ఉండాలని కోర్టు తన తీర్పులో ఆదేశించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ మహిళా టీచర్ మరో కోర్టును ఆశ్రయించింది. ఒకే వీధిలో ఉండడం వల్ల ఆ దూరాన్ని 2500 ఫీట్లకు తగ్గించాలని ఆమె కోర్టును కోరింది. కానీ కోర్టు దాన్ని అంగీకరించలేదు. ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. ఈ కేసులో ఒకవేళ టీచర్ క్రిస్టినా దోషిగా తేలితే ఆమెకు 60 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది.
కోర్టులో విచారణ – కుటుంబం అండగా
కేసు విచారణలో క్రిస్టినా తన భర్తతో కలిసి హాజరైంది. ఆమె సంబంధం లేదని కోర్టులో వాదించింది. అయితే కోర్టు, విద్యార్థి నివాసానికి 5000 అడుగుల దూరంలో ఉండాలని ఆమెకు ఆదేశాలు జారీ చేసింది.
read hindi news: hindi.vaartha.com
Read Also : Sri Lanka Cricket : శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్ లో పాము కలకలం…