గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు (stock market) బలహీనంగా కదలడంతో టాప్-10 విలువైన కంపెనీల్లో 8 సంస్థలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థలు కలిపి వారం రోజుల్లోనే తమ మార్కెట్ విలువ నుంచి సుమారు రూ.79,129 కోట్లను కోల్పోయాయి. మార్కెట్‌లో ప్రతికూల సెంటిమెంట్ నెలకొనడం, సెన్సెక్స్ పతనం ఈ నష్టాలకు ప్రధాన కారణంగా మారాయి. ఇందులో బజాజ్ ఫైనాన్స్ అత్యధికంగా నష్టపోయిన కంపెనీగా నిలిచింది.
Read also: Gold Rate Today : బంగారం–వెండి ధరలు భారీగా తగ్గాయి…

Heavy losses in the stock markets
బ్యాంక్ మార్కెట్ విలువ రూ.18,516 కోట్ల మేర క్షీణించింది
బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.19,290 కోట్లు తగ్గగా, ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.18,516 కోట్ల మేర క్షీణించింది. అలాగే భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్‌ఐసీ కూడా నష్టాల జాబితాలో ఉన్నాయి. అయితే ప్రతికూల పరిస్థితుల్లోనూ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ లాభాలు నమోదు చేయడం విశేషం. సెన్సెక్స్ వారం వ్యవధిలో 444 పాయింట్లకుపైగా పడిపోయినప్పటికీ, దేశంలోని అత్యంత విలువైన కంపెనీల జాబితాలో రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్ తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: