రూ.25 వేల వరకు డిజిటల్ ట్రాన్స్‌ఫర్ ఉచితం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ ఖాతాదారుల కోసం IMPS (Immediate Payment Service) లావాదేవీలపై కొత్త చార్జీలను ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి తీసుకురానుంది. డిజిటల్ మార్గాల ద్వారా రూ.25,000 వరకు జరిగే IMPS బదిలీలపై ఎలాంటి రుసుము వసూలు చేయబడదు. అయితే ఈ మొత్తాన్ని మించిన లావాదేవీలకు నిర్ణీత ఛార్జీలు వర్తిస్తాయి.
Read Also: Retail Business డీమార్ట్‌లో ధరలు ఎందుకు తక్కువగా ఉంటాయి? కారణం ఇదే

ఎంపిక చేసిన ప్రత్యేక కేటగిరీ ఖాతా
అయితే, కొన్ని ప్రత్యేక ఖాతాదారులకు ఈ రుసుముల నుంచి మినహాయింపు కల్పించారు. ముఖ్యంగా పెన్షన్ ఖాతాలు, ఎంపిక చేసిన ప్రత్యేక కేటగిరీ ఖాతాలకు ఈ ఛార్జీలు వర్తించవని బ్యాంకు స్పష్టం చేసింది.
ఇదే సమయంలో, ఇటీవల SBI ఇతర బ్యాంకుల ATMలు మరియు ఆటోమేటెడ్ డిపాజిట్ విత్‌డ్రాయల్ మెషీన్లు (ADWM) ఉపయోగించే లావాదేవీలపై కూడా చార్జీలను సవరించిన విషయం తెలిసిందే. నిర్ణయించిన ఉచిత లావాదేవీల పరిమితిని మించినప్పుడు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకు తెలిపింది. ఈ మార్పులతో కస్టమర్లు తమ బ్యాంకింగ్ లావాదేవీలను మరింత జాగ్రత్తగా ప్రణాళిక చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: