పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకం ద్వారా తక్కువ(Savings Plan) మొత్తంతోనే భవిష్యత్తుకు భద్రత కల్పించుకోవచ్చు. రోజుకు కేవలం రూ.200 చొప్పున పొదుపు చేస్తే, దీర్ఘకాలంలో రూ.10 లక్షలకు మించి మొత్తం కూడబెట్టే అవకాశం ఈ పథకంలో ఉంది. ప్రస్తుతం ఈ RD ఖాతాకు 6.7 శాతం వార్షిక వడ్డీ రేటు అందిస్తున్నారు.
Read Also: Budget 2026: ఆదాయం పెరిగి.. పన్నులు తగ్గుతాయా?

ఈ పథకంలో ఖాతా(Savings Plan) ప్రారంభించేందుకు కనీసంగా రూ.100 మాత్రమే సరిపోతుంది. ప్రభుత్వ హామీ ఉండటం వల్ల పెట్టుబడులు పూర్తిగా సురక్షితంగా ఉంటాయి. ఐదేళ్ల కాలపరిమితితో ఖాతా తెరిచి, కావాలంటే మరో ఐదేళ్లపాటు పొడిగించుకునే వెసులుబాటు కూడా కల్పించారు.
ఖాతా తెరిచిన ఒక సంవత్సరం తర్వాత, డిపాజిట్ మొత్తంలో 50 శాతం వరకు రుణం పొందే అవకాశం ఉంది. ఈ రుణంపై కేవలం 2 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేస్తారు. అలాగే, మూడు సంవత్సరాలు పూర్తయ్యాక అకాలంగా ఖాతాను ముగించుకునే సౌకర్యం కూడా ఈ పథకంలో ఉంది. పదేళ్లపాటు రోజుకు రూ.200 చొప్పున పెట్టుబడి పెట్టినట్లయితే, మొత్తం రూ.7.20 లక్షల డిపాజిట్ అవుతుంది. దీనిపై సుమారు రూ.2,05,131 వడ్డీ వచ్చి, మెచ్యూరిటీకి మొత్తం రూ.10,25,131 అందుతాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: