జపాన్ రాజకీయం మరోసారి కల్లోలంలో పడింది. మధ్యలోనే ప్రధాని పదవి ముగియడం, పార్టీలో అంత ర్గత
గొడవలు, ఆర్థిక సంక్షోభం, ప్రజల నమ్మకం కోల్పో వడం వంటి కారణాలతో దేశం అస్థిరతలోకి జారుకుంది.
అయితే, ఈ సంక్షోభం ఒక చారిత్రక పరిణామానికి నాంది పలికింది. సనే తకైచి (Sanae Takaichi)జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రి గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ రాజకీయ సంక్షోభంలో పదవిని కోల్పోయిన మాజీ ప్రధాని ఎ
గేరు ఇషిబా. 2024 అక్టోబర్లో ప్రధాని అయిన ఆయన, కేవలం ఒక సంవత్స రంలోనే రాజీనామా చేయాల్సి
వచ్చింది. అవినీతి ఆరోపణలు, ఎన్నికల్లో ఘోర పరాజయాలు, లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్టిపి)పై ప్రజల్లో
పెరిగిన అసంతృప్తి ఇందుకు ప్రధాన కారణాలు. దశాబ్దాల తర్వాత, ఎల్డీపీ పార్లమెంట్లో తన మెజారిటీని
కోల్పోయింది. యెన్ విలువ పడి పోవడం, నిత్యావసరాల ధరలు పెరగడం, జీతాలు పెరగక పోవడం వంటి ఆర్థికసమస్యలు ప్రజల కోపానికి కారణమ య్యాయి. ఈ అంశాలతో పాటు, పార్టీలోని వారి ఒత్తిడి కారణంగా ఇషిబా రాజీనామా తప్పనిసరి అయ్యింది. ఇషిబా రాజీనామాతో ఎల్టిపిలో హోరాహోరీ పోటీ జరిగింది. ఈ పోటీలో సనే తకాయచి విజయం సాధించి, అక్టోబర్ మధ్య నాటికి పార్లమెంట్ ఆమోదంతో ప్రధానిగా ప్రమాణ స్వీకా రంచేయనున్నారు. ఆమె గెలుపు కేవలం జపాన్ తొలి మహిళా ప్రధాని కావడమే కాదు, కఠిన సంప్రదాయవాదభావజాలం కలిగిన నాయకురాలు అధికారంలోకి రావడం కూడా ఒక చారిత్రక ఘట్టం.

షింజో అబేకు సన్నిహితురాలు
ఆమె దివంగత ప్రధాని షింజో అబేకు అత్యంత సన్నిహితురాలు. అబే జాతీయవాద విధానాలను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యం ఆమెకు ఉంది. దేశం మార్పు కోరుకుంటున్న సమయంలో, ఆమె విజయం మరింత గంభీరమైన రాజకీయ మార్పుకుసంకేతం. నూతన ప్రధాని ముందు ఉన్న సవాళ్లు చిన్నవి కావు. దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని తీసుకురావడం,ఆర్థిక ఒత్తిళ్లను తట్టు కోవడం, సామాజిక సమస్యలను పరిష్కరించడం ఆమెకు అత్యంత కీలకం. జపాన్ చరిత్రలో తరచుగా ప్రధానులు తక్కువ కాలంలోనే పదవీ విరమణ చేయడం సర్వసాధారణం. ఇప్పుడు అదే పరిస్థితి మళ్లీ ఎదురవుతుందేమోనని జపనీయులు ఆందోళన చెందుతున్నారు. తకాయచి (Sanae Takaichi)ముందు ఉన్న అతిపెద్ద సవాలు ఇదే. ముఖ్యమైన చట్టాలు, బడ్జెట్ ఆమోదం పొందాలంటే ప్రతిపక్షం మద్దతు అనివార్యం. ప్రతి పక్షంతో కలిసి పనిచేస్తూ, ప్రభుత్వాన్ని స్థిరంగా నడిపించ గలిగితేనే ఆమె నాయకత్వం నిల బడుతుంది. జపాన్ ఆర్థిక వ్యవస్థ దశాబ్దాలుగా స్తబ్దంగా ఉంది. యెన్ విలువ తగ్గిపో వడంతో జీవన వ్యయం పెరిగింది. అబే తరహాలోనే తకా యచి కూడా ప్రభుత్వవ్యయాన్ని పెంచేందుకు మొగ్గు చూపి నా, ప్రజలు కోరుకునేది మాత్రం జీతాల పెంపు, మెరుగైన జీవన ప్రమాణాలు. ఈ దిశగా ఆమె తీసుకునే చర్యలుఆమె పాలనకు కీలకం కానున్నాయి.
వృద్ధ జనాభా
పెరిగిన వృద్ధ జనాభా వల్ల సామాజిక సంక్షేమ ఖర్చులు పెరుగుతూ, దేశంపై మరింత ఆర్థిక భారం పడుతోంది. ఎన్నికల ఓటములు పార్టీ నాయకత్వంపై నమ్మకాన్ని దెబ్బతీశాయి. ‘జపాన్ ఫస్ట్’ అనే నినాదంతో వలసలు, భద్రత, సైనిక బలోపేతంపై కఠిన వైఖరిని కోరుకునే వర్గాలు పార్టీలో బలంగా మారుతున్నాయి. తకాయచి కఠిన వైఖరి ఈ వర్గానికి అనుకూలంగా ఉన్న ప్పటికీ, ప్రజల అసంతృప్తిని తగ్గించాలంటే ఆమె సమన్వయం సాధించాల్సి ఉంటుంది. దేశీయ సవాళ్ల మాది రిగానే విదేశాంగ విధానం కూడా తకాయచికి (Sanae Takaichi)కీలకం. ఆమె జపాన్ భద్రత కోసం బలమైన సైన్యం, అమెరికాతో పటి ష్టమైన భాగస్వామ్యం, చైనాపై కఠిన వైఖరిని కోరుకుంటారు. అమెరికాతో సంబంధాలు బలంగానే కొనసాగే అవకాశం ఉన్నా, తిరిగి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ వల్ల కొత్త చిక్కులు తలెత్తవచ్చు. జపాన్ రక్షణ ఖర్చులను జీడీపీలో 3.5శాతం వరకు పెంచాలని ట్రంప్ డిమాండ్ చేసే అవకా శంఉంది. ఈ ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంటూ, అమెరికా మద్దతును నిలుపుకోవడం తకాయచికి ఒక సవాలు. ఆసియా పొరుగు దేశాలైన చైనా, దక్షిణ కొరియా పట్ల ఆమె వైఖరి కఠినంగా ఉండవచ్చు. అబే జాతీయవాదానికి మద్దతు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 మార్పు సూచనలు, యాసుకునిమందిర సందర్శన వంటి అంశాలు ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచవచ్చు. అయినప్పటికీ, చైనా జపాన్కు ప్రధాన ఆమె భారతదేశం, ఆస్ట్రే లియా వంటి దేశాలతో సంబంధాలు బలోపేతం చేసి, క్వాడ్ కూటమిలో జపాన్ పాత్రను మరింత పెంచాలనుకుంటు న్నారు.

‘ఐరన్ లేడీ’
సనే తకాయచి అధికారంలోకి రావడం రాజకీయం గా అనివార్యమైనప్పటికీ, ఇది పాత సంప్రదాయవాదానికి కొత్త చారిత్రక మలుపుగా మారింది. ఎల్ పి తన పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తూనే, ఒక మహిళా నాయకురా లిని ప్రోత్సహించడం జపాన్ రాజకీయ మార్పుకు సంకేతం. తకాయచికి ముందు ఉన్న పరీక్షలు కఠినమైనవి. ప్రతిపక్షం తో సయోధ్య, ఆర్థిక స్థిరత్వం, విదేశాంగ సమతుల్యత. ఈ పరీక్షల ఫలితమే ఆమెను జపాన్ ‘ఐరన్ లేడీ’గా మారుస్తుం దా లేదా మరో తాత్కాలిక ప్రధానిగా మిగిలిపోతుందా అన్నది నిర్ణయిస్తుంది. యుద్ధానంతర రాజకీయ స్థిరత్వం ముగిసిన తర్వాత, జపాన్లో ప్రారంభమైన ఈ కొత్త అధ్యాయం ఎంతవరకు కొనసాగుతుందో చూడాలి.
-డి జె మోహన రావు
సనే తకైచి భావజాలం ఏమిటి?
తకైచి ఒక కఠినమైన సంప్రదాయవాది మరియు జాతీయవాది. తకైచి తీవ్ర కుడి-కుడి అతిజాతీయవాద సంస్థ నిప్పాన్ కైగి సభ్యుడు. మరొక LDP మంత్రి మరియు ప్రతినిధుల సభ సభ్యుడు టారో కోనో, తకైచి LDPలోని రాజకీయ వర్ణపటంలో తీవ్ర కుడి వైపున ఉన్నారని అన్నారు.
జపాన్లో అబెనోమిక్స్ అంటే ఏమిటి?
అబెనోమిక్స్ అంటే ఏమిటి? 2012లో ప్రధాన మంత్రి షింజో అబే రెండవసారి అధికారంలోకి వచ్చినప్పుడు జపాన్ కోసం నిర్దేశించిన ఆర్థిక విధానాలకు అబెనోమిక్స్ ముద్దుపేరు . అబెనోమిక్స్‌లో దేశం యొక్క ద్రవ్య సరఫరాను పెంచడం, ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం మరియు జపాన్ ఆర్థిక వ్యవస్థను మరింత పోటీతత్వంతో మార్చడానికి సంస్కరణలను అమలు చేయడం ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
EPaper: https://epaper.vaartha.com/
Read Also: