దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ భారత మార్కెట్‌లో మరోసారి స్మార్ట్‌ఫోన్ ప్రేమికులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ కంపెనీ తాజాగా తన ప్రసిద్ధ M సిరీస్లో భాగంగా “గెలాక్సీ M17 5G” (Samsung Galaxy M17 5G) అనే కొత్త మోడల్‌ను శుక్రవారం అధికారికంగా ఆవిష్కరించింది. బడ్జెట్ రేంజ్‌లో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో పాటు ఆకర్షణీయమైన రూపకల్పనను చేసింది.. ముఖ్యంగా 5జీ కనెక్టివిటీతో పాటు దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఇవ్వడం దీని ప్రధాన విశేషం.
TCS job cuts : టీసీఎస్‌లో భారీ నష్టాలు ఉద్యోగుల తొలగింపులు, పునర్నిర్మాణ
యువతను, బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను మూడు వేరియంట్లలో తీసుకొచ్చారు. బేస్ మోడల్ అయిన 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,499గా నిర్ణయించారు. అలాగే, 6GB RAM + 128GB వేరియంట్ ధర రూ. 13,999 కాగా, 8GB RAM + 128GB టాప్ వేరియంట్ ధర రూ. 15,499గా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు అక్టోబర్ 13 నుంచి శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్‌తో పాటు ప్రముఖ రిటైల్ స్టోర్లలో ప్రారంభమవుతాయి. మూన్‌లైట్ సిల్వర్, సఫైర్ బ్లాక్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది.గెలాక్సీ M17 5G ఫోన్‌లో 6.7 అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే అమర్చారు.

దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ ఉండటం వల్ల ఫోన్ మన్నికగా ఉంటుంది. శాంసంగ్ సొంత ప్రాసెసర్ అయిన ఎగ్జినోస్ 1330 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ UI 7 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది.ఫోటోగ్రఫీ కోసం వెనుకవైపు మూడు కెమెరాల సెటప్ ఇచ్చారు.
వైస్ ప్రెసిడెంట్ కెన్నెత్ పై మాట్లాడుతూ
ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 5 MP అల్ట్రావైడ్ లెన్స్, 2 MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు.
మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజ్‌ను పెంచుకునే సౌకర్యం కూడా ఉంది.ఈ సందర్భంగా శాంసంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కెన్నెత్ పై మాట్లాడుతూ, “భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గెలాక్సీ M17 5G (Samsung Galaxy M17 5G) ని రూపొందించాం. దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో ఈ ఫోన్‌పై పెట్టే పెట్టుబడికి పూర్తి విలువ లభిస్తుంది” అని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: