हिन्दी | Epaper
ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్

BC Reservation : BJP మెడలు వంచైనా రిజర్వేషన్లు సాధిస్తాం – రేవంత్

Sudheer
BC Reservation : BJP మెడలు వంచైనా రిజర్వేషన్లు సాధిస్తాం – రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) బీసీలకు రిజర్వేషన్ల విషయంలో ఆత్మవిశ్వాసంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. బీసీ హక్కుల కోసం అవసరమైతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచైనా రిజర్వేషన్లు సాధించి తీరతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీ సామాజిక న్యాయం కోసం తన ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ దిశగా ముందడుగు వేసే సమయం ఆసన్నమైందని చెప్పారు.

42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహణకు కసరత్తు

రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు (BC Reservation)కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం తెలిపారు. ఈ రిజర్వేషన్లతో త్వరలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందని పేర్కొన్నారు. రైతుల ఉద్యమం సమయంలో మొదట మోడీ ప్రభుత్వం మొండికేసినప్పటికీ, చివరకు క్షమాపణ చెప్పే స్థితికి రావాల్సి వచ్చిందన్న ఉదాహరణను చెప్పుతూ, బీసీ రిజర్వేషన్ అంశంలోనూ అదే జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

బీజేపీ ధోరణిని విమర్శించిన సీఎం

బీజేపీ రాజకీయ ధోరణి ఏమిటంటే “తొలుత ససేమిరా అంటారు, తర్వాత పారిపోతారు” అని విమర్శించిన సీఎం రేవంత్, బీసీల విషయంలో తమ ప్రభుత్వ లక్ష్యం చాలా స్పష్టమని అన్నారు. బీసీలకు న్యాయం చేయాలన్నది తమ ఆలోచన మాత్రమే కాదు, సంకల్పమని చెప్పారు. కేంద్రంలో ఉన్న బీజేపీ అడ్డుపడినా, తమ నిర్ణయాన్ని అమలు చేయడంలో వెనకడుగు వేయమని ఆయన తేల్చి చెప్పారు.

Read Also : Godavari : భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870