అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలు తమ వద్ద ఉన్నాయని, భారత వైమానిక, క్షిపణి దాడులను అవి అడ్డుకుంటాయని బీరాలు పలికిన పాకిస్థాన్(Pakistan)కు ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)తో చుక్కెదురైంది. చైనా(China) సరకును నమ్ముకుని భంగపడ్డ పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా వైపు చూస్తోంది. భారత్(India) చేసిన దాడులను చైనా(China) గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేకపోవడం వల్ల అగ్రరాజ్యంతో రక్షణ సంబంధాల బలోపేతం దిశగా పాక్ అడుగులు వేస్తోంది. అమెరికాలో పాక్ సైనికాధికారులు వరుస పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే F-16 ఫైటర్ జెట్‌లు, గగనతల రక్షణ వ్యవస్థలను అమెరికా నుంచి కొనుగోలు చేయాలని పాక్ యోచిస్తోందని తెలుస్తోంది.
పాకిస్తాన్ ఎయిర్ చీఫ్ అమెరికా పర్యటన
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ అమెరికాలో ఇటీవల పర్యటించారు. మునీర్ అలా అమెరికా వెళ్లి వచ్చారో లేదో, పాక్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్దు సైతం తాజాగా అగ్రరాజ్యానికి వెళ్లారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత యూఎస్‌తో రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఈ వరుస పర్యటనలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ఎయిర్ మార్షల్, యూస్ మిలిటరీ, ఇతర నాయకులతో సమావేశమయ్యారు.

రక్షణ సంబంధాల బలోపేతమే లక్ష్యం
చైనా పరికరాల విశ్వసనీయతపై ఆందోళనల నేపథ్యంలో అమెరికాకు చెందిన అధునాతన ఆయుధాలు, వ్యవస్థలతో తమ వైమానిక దళాన్ని ఆధునీకరించడంపై పాక్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది F-16 ఫైటర్ జెట్‌లు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్ ఎయిమ్-7 స్పారో వంటి వాటిని కొనుగోలు చేయాలని పొరుగుదేశం యోచిస్తోందని తెలుస్తోంది.
అమెరికా వర్గాల్లో పాక్‌పై సందేహాలు
చైనా నుంచి కొనుగోలు చేసిన HQ-9, LY-80 వ్యవస్థలు, వాటి రాడార్లు భారత్ ప్రయోగించిన క్షిపణులను ఆపలేకపోయాయి. అయితే, దశాబ్దాలుగా చైనాతో పాక్ స్నేహంగా వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా సైనిక ఉన్నతాధికారులు, రాజకీయ వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. అయినప్పటికీ అమెరికాతో సైనిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకునే లక్ష్యంతో పాక్ సైనికాధికారులు అగ్రరాజ్యం అమెరికాలో అధికారిక పర్యటనలు చేస్తున్నారు.
దశాబ్దాలుగా చైనాతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్న పాకిస్తాన్‌పై, అమెరికా రాజకీయ వర్గాలు, రక్షణ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా, వాతావరణాన్ని మెల్లగా మార్చేందుకు పాక్ అధికారం ప్రతినిధులు దౌత్యపూర్వకంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Dalai Lama : వారసుడి ఎంపిక ప్రక్రియ దలైలామా చేతుల్లోనే ఉంది : భారత్