Onion prices: సామాన్య ప్రజలకు, వినియోగదారులకు త్వరలోనే ఉల్లి ధరల నుంచి పెద్ద ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా భయపెడుతున్న ఉల్లి ధరలు క్రమంగా దిగివచ్చే అవకాశాలు స్పష్టమవుతున్నాయి. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం, రాబోయే రోజుల్లో ఉల్లి కొనుగోలు మరింత సులభం కానుంది.

మార్కెట్‌లోకి ఖరీఫ్ పంట దిగుబడుల ప్రవేశం
ధరలు తగ్గడానికి ప్రధాన కారణం కొత్త పంట మార్కెట్‌కు రావడమే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ఉల్లి దిగుబడులు పెద్ద ఎత్తున మార్కెట్‌లోకి చేరుతున్నాయి. సరఫరా మెరుగవ్వడంతో పాటు, డిమాండ్‌కు తగినట్లుగా సరుకు అందుబాటులోకి వస్తుండటం ధరల నియంత్రణకు సహకరిస్తోంది.
Read also: Stock Market Today: నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
Onion prices: కేంద్ర ప్రభుత్వ జోక్యం – పాత నిల్వల తరలింపు పెంపు
ధరలను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా కీలక చర్యలు చేపట్టింది. బఫర్ స్టాక్ కింద ఉంచిన పాత ఉల్లి నిల్వల తరలింపును కేంద్రం గణనీయంగా పెంచింది. మార్కెట్‌లో కృత్రిమ కొరత ఏర్పడకుండా తగినన్ని నిల్వలను సకాలంలో విడుదల చేస్తుండటంతో ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోవుతున్న ఉల్లి ధరలు
లభ్యత మెరుగుపడటంతో రిటైల్ మార్కెట్‌లో ధరలు స్థిరపడుతున్నాయి. ఈ నెల 10 నాటికి దేశవ్యాప్తంగా సగటున కిలో ఉల్లి ధర రూ.52.99 వద్ద నమోదైంది. సరిగ్గా నెల క్రితం ఇదే ధర రూ.53.10గా ఉండేది. ఇక ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వినియోగదారులకు రూ.100కు దాదాపు 2 నుండి 2.5 కిలోల చొప్పున ఉల్లిని విక్రయిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: