నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) పబ్లిక్ ఇష్యూ(Nse Ipo)కు వస్తే.. ప్రముఖ మదుపరి, డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ(Radhakishan Damani)కి లాభాలపంటే!. ఎందుకంటే ఎన్‌ఎస్‌ఈలో దమానీకి 1.58% (3.91 కోట్ల షేర్లు) వాటా ఉంది. 2020 జనవరి- మార్చిలో విదేశీ పెట్టుబడిదారు నార్వెస్ట్ వెంచర్ పార్ట్‌నర్స్ నుంచి ఈ వాటాను దమానీ కొనుగోలు చేశారు.
ఎన్‌ఎస్‌ఈ షేర్ల విలువ ఎంత?
ఎన్‌ఎస్‌ఈ షేరు ఎక్స్ఛేంజీల్లో నమోదు కాలేదు. అయితే అన్‌లిస్టెడ్ షేరు ధర ఒక్కోటి రూ.2,389 పలుకుతోంది. ఫలితంగా దమానీ దగ్గర ఉన్న ఎన్‌ఎస్‌ఈ షేర్ల నికర విలువే రూ.9,341 కోట్లు అవుతుంది. కాగా.. ఎంతో కాలంగా ఐపీఓకు వచ్చేందుకు, సెబీ అనుమతుల కోసం ఎన్‌ఎస్‌ఈ (Nse Ipo) వేచి చూస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ కల నెరవేరుతుందని భావిస్తున్నారు.
దమానీ వాటా విక్రయిస్తారా?
సాధారణంగా పెద్ద సంస్థలు ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేప్పుడు, ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్లు – ప్రస్తుత వాటాదార్లు కొంత వాటాలు విక్రయించి, ప్రయోజనం పొందుతారు. ఎన్‌ఎస్‌ఈ ఐపీఓలో దమానీ తన వాటా షేర్లను విక్రయిస్తారా? లేదంటే కొనసాగిస్తారా? అనే దానిపై స్పష్టత లేదు. విక్రయిస్తే మాత్రం, ఆయన తన పెట్టుబడిపై గణనీయ ప్రతిఫలాన్ని పొందుతారనేది మార్కెట్ వర్గాల విశ్లేషణ. పెద్ద కంపెనీలు ఐపీఓ సమయంలో Offer for Sale (OFS)

ద్వారా ప్రమోటర్లు, వృద్ధి చెందిన వాటాదారులు షేర్లు విక్రయిస్తారు. దమానీ కూడా తన షేర్లను OFS కింద విక్రయిస్తే, ఆయన పెట్టుబడిపై భారీ లాభాలు పొందే అవకాశం ఉంది. అయితే దమానీ వాటా విక్రయం చేస్తారా లేక కొనసాగిస్తారా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Stock market: మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభం