భారత స్టాక్ మార్కెట్‌లో ఇప్పటివరకు లేని స్థాయిలో భారీ ఐపీఓ త్వరలో రానున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. రిలయన్స్ గ్రూప్‌కు చెందిన జియో ప్లాట్‌ఫార్మ్స్ను 2026 సంవత్సరం తొలి అర్ధభాగంలో పబ్లిక్ ఇష్యూకు(Mukesh Ambani) తీసుకురావాలని సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో భారీ ఆసక్తి నెలకొంది.
Read Also: Fuel Prices: ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు

ముకేష్ అంబానీ ప్రకటన తర్వాత ఊహాగానాలు
జియోను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయనున్నట్లు గత ఏడాది రిలయన్స్ చైర్మన్ ముకేష్ అంబానీ అధికారికంగా వెల్లడించారు. ఆ ప్రకటన తర్వాత నుంచి జియో ఐపీఓపై అంచనాలు మరింత పెరిగాయి. దేశీయంగా అతిపెద్ద టెలికాం కంపెనీగా ఎదిగిన జియో, ఈ ఐపీఓతో కొత్త రికార్డులు సృష్టించనుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జియో ఐపీఓ ద్వారా సంస్థ విలువ మరింత పెరగనుందని, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఇది ముఖ్యమైన అవకాశంగా మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఈ ఐపీఓ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: