Gold price today : పసిడి కొనుగోలుదారులకు మరోసారి శుభవార్త అందింది. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ Gold ధర వరుసగా రెండో రోజు కూడా తగ్గింది.
మార్చి 4న హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 2,650 తగ్గి తులం రూ. 1,54,650 వద్దకు చేరింది. అంతకుముందు రోజు కూడా రూ. 2,350 తగ్గడంతో రెండు రోజుల్లో పసిడి ధర దాదాపు రూ. 5,000 వరకు తగ్గింది.
ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా పడిపోయింది. 10 గ్రాములకు రూ. 2,890 తగ్గి రూ. 1,67,620 వద్ద ట్రేడవుతోంది.
మరోవైపు వెండి ధర మాత్రం పెద్దగా మారలేదు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 3.15 లక్షల వద్ద స్థిరంగా ఉంది.
Read Also: Funky Movie: విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్?

అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితి
అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు సుమారు $5,150 వద్ద ట్రేడవుతోంది. ఇది ముందు రోజు $5,400 మార్కును దాటిన తర్వాత గణనీయంగా పడిపోయింది.
బంగారం ధర తగ్గడానికి కారణాలు
ప్రస్తుతం అమెరికా డాలర్ బలపడడం బంగారం ధరపై ప్రధాన ప్రభావం చూపుతోంది. డాలర్ ఇండెక్స్ ఒక నెల గరిష్ఠ స్థాయికి చేరడంతో పెట్టుబడిదారులు బంగారం నుంచి డాలర్, బాండ్ మార్కెట్లవైపు మొగ్గుచూపుతున్నారు.
అదే సమయంలో యుద్ధ ప్రభావంతో చమురు ధరలు పెరిగే అవకాశం ఉండటం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందని అంచనా. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు తగ్గడంతో బంగారం ఆకర్షణ తగ్గిందని నిపుణులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: