తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్ర మత్స్యరంగ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు లోక్సభ వేదికగా స్పష్టం చేసింది. తెలంగాణలో ప్రత్యేకంగా కొర్రమీను క్లస్టర్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనితో పాటు రాష్ట్రంలోని నాలుగు పట్టణాల్లో ఫుడ్ స్ట్రీట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపింది. ఈ విషయాలను కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లోక్సభలో వెల్లడించారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన ఆయన ప్రధాన మంత్రి మత్స్య యోజన కింద తెలంగాణలో రూ.196.80 కోట్ల విలువైన ప్రతి పాదనలకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
Read Also: Telangana: జూన్ నాటికి 9 వేల ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం!

తక్కువ ధరకే చేపల లభించే ఛాన్స్ ఉంది
రాజధాని హైదరాబాద్ నగరంలో అత్యాధునిక హోల్సేల్ చేపల మార్కెట్, మంచిర్యాల (Mancherial) జిల్లాలో కొర్రమీను ఉత్పత్తి, ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.కాగా, హైదరాబాద్ నగరంలో అతిపెద్ద చేపల మార్కెట్, మంచిర్యాలలో కొర్రమీను క్లస్టర్ ఏర్పాటు చేయటం ద్వారా తక్కువ ధరకే చేపల లభించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం తెలంగాణలోని చెరువులతో పాటు ఏపీ సముద్రతీరం నుంచి ఎక్కువగా చేపలు వస్తుంటాయి. అయితే సుదూర ప్రాంతాల నుంచి చేపలు దిగుమతి చేసుకుంటుండటం వల్ల చేపల ధరలు ఎక్కువగా ఉంటున్నారు. అతిపెద్ద హోల్సేల్ మార్కెట్లు అందుబాటులోకి వస్తే భోజన ప్రియులకు తక్కువ ధరకే చేపలు దొరకనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: