దేశంలో అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తాజాగా SIIP (Systematic Investment Insurance Plan) అనే నూతన యూనిట్-లింక్డ్ బీమా పథకాన్ని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ బీమా రక్షణతో పాటు పెట్టుబడి అవకాశాలను కూడా అందించేలా రూపొందించారు. దీని ద్వారా పాలసీదారులు దీర్ఘకాలంలో మెరుగైన ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉందని LIC అధికారులు తెలిపారు.
Read also: Grok : ‘గ్రోక్’ అశ్లీల కంటెంట్ పై కేంద్రం సీరియస్

SIIP ప్లాన్ ద్వారా బీమా,పెట్టుబడి అవకాశాలు
ఈ ప్లాన్‌లో 90 రోజుల శిశువుల నుంచి 65 ఏళ్ల వయస్సు కలిగిన వారు చేరవచ్చు. పాలసీ కాలపరిమితి 10 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. పాలసీదారుడు మరణించినప్పుడు డెత్ బెనిఫిట్ లభించడంతో పాటు, పాలసీ గడువు పూర్తయ్యాక మెచ్యూరిటీ మొత్తాన్ని కూడా అందిస్తారు.
SIIP ప్లాన్‌లో నాలుగు రకాల ఫండ్ ఎంపికలు అందుబాటులో ఉండగా, మార్కెట్ పరిస్థితులను బట్టి ఒక ఫండ్ నుంచి మరొకదానికి ఉచితంగా స్విచ్ చేసుకునే సౌకర్యం ఉంది. అదనంగా ప్రమాద బీమా వంటి రైడర్లను కూడా జోడించుకోవచ్చు.
పన్ను మినహాయింపు ప్రయోజనాలు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వర్తిస్తాయని LIC తెలిపింది. పాలసీ ప్రారంభించిన ఐదేళ్ల తర్వాత అత్యవసర అవసరాల కోసం పాక్షిక ఉపసంహరణ (Partial Withdrawal) సదుపాయాన్ని కూడా ఈ ప్లాన్‌లో అందించారు. పెట్టుబడితో పాటు భవిష్యత్ భద్రత కోరుకునే వారికి ఈ SIIP ప్లాన్ అనువైన ఎంపికగా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: