భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన గౌతమ్ అదానీ(Adani) నేతృత్వంలోని అదానీ గ్రూప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అదానీ గ్రూప్‌కి చెందిన సిమెంట్ కంపెనీ ACC లిమిటెడ్ పై ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) రెండు వేర్వేరు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన మొత్తం రూ. 23.07 కోట్ల జరిమానా విధించింది. ఈ జరిమానా ఉత్తర్వులను కంపెనీ అక్టోబర్ 1, 2025న స్వీకరించింది. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తామని, వీటి ప్రభావం తమ ఆర్థిక కార్యకలాపాలపై ఉండదని స్పష్టం ACC చేసింది.
భారతదేశంలో బంగారం ధరలు రికార్డు
ఆదాయపు పన్ను శాఖ ప్రకారం
ఈ జరిమానాలు ACC కంపెనీ అదానీ గ్రూప్‌లో విలీనం కానున్న కంటే ముందు కాలానికి సంబంధించినవి. ఆదాయపు పన్ను శాఖ 2015-16, 2018-19 అసెస్‌మెంట్ సంవత్సరాలకు వేర్వేరుగా జరిమానాలు విధించింది. మొదటి జరిమానా (అసెస్‌మెంట్ ఇయర్ 2015-16) కాలానికి సంబంధించినది. ఆదాయపు పన్ను శాఖ ప్రకారం, ACC.. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ. 49.25 కోట్ల ఖర్చును క్లెయిమ్ చేసింది. కానీ ఈ ఖర్చులను శాఖ అంగీకరించలేదు. ఫలితంగా ఆదాయాన్ని తప్పుగా చూపించిందని నిర్ణయించి, సంబంధిత పన్ను బాధ్యతపై రూ. 14.22 కోట్ల జరిమానా విధించింది. ఈ చర్యను “తప్పుడు ఆదాయ వివరాల సమర్పణ” కింద వర్గీకరించారు. ఇక రెండవ జరిమానా (అసెస్‌మెంట్ ఇయర్ 2018-19) విషయానికి వస్తే.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ACC.. రూ. 12.79 కోట్ల ఖర్చును క్లెయిమ్ చేసినప్పటికీ, ఆదాయపు పన్ను శాఖ దానిని తిరస్కరించింది. దీని ఫలితంగా ఆదాయం తక్కువగా చూపించిందని పేర్కొంటూ రూ. 8.85 కోట్ల జరిమానా విధించింది. ఈ జరిమానా సంబంధిత పన్ను బాధ్యతలో 200 శాతం రేటుతో విధించబడింది.

జరిమానా ఉత్తర్వులను కంపెనీ అప్పీల్ చేస్తాం
ACC లిమిటెడ్ అధికారిక ప్రకటనలో పేర్కొన్నదేమిటంటే.. ఈ రెండు జరిమానా ఉత్తర్వులను కంపెనీ అప్పీల్ చేస్తామని తెలిపింది. నిర్ణీత గడువులోపు ఆదాయపు పన్ను కమిషనర్ వద్ద అప్పీల్ ఫైల్ చేస్తామని.. అలాగే జరిమానా డిమాండ్లపై స్టే (stay) కోరుతామని తెలిపింది. ఈ జరిమానాలు తమ రోజువారీ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం చూపవని ACC స్పష్టం చేసింది. ACC లిమిటెడ్ అనేది భారతదేశంలో ప్రముఖ సిమెంట్ కంపెనీ. ఇది అదానీ సిమెంట్స్‌కి అనుబంధ సంస్థ, కాగా అంబుజా సిమెంట్స్.. ACCలో 50 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. 2022 సెప్టెంబర్‌లో, అదానీ గ్రూప్ స్విట్జర్లాండ్‌కి చెందిన హోల్సిమ్ గ్రూప్ నుండి అంబుజా సిమెంట్స్, ACC లిమిటెడ్‌ను 6.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 51,000 కోట్లు) విలువైన ఒప్పందంలో కొనుగోలు చేసింది.
అదానీ ఎందుకు ధనవంతుడు?
గౌతమ్ అదానీ స్థాపించిన అదానీ గ్రూప్ యొక్క వేగవంతమైన విస్తరణ మరియు వైవిధ్యీకరణ కారణంగా అతను ధనవంతుడు.
అదానీ అసలు పేరు ఏమిటి?
గౌతమ్ అదానీ | జీవిత చరిత్ర, వ్యాపారం, కుటుంబం, నేరారోపణ …
గౌతమ్ అదానీ
గౌతమ్ అదానీ (జూన్ 24, 1962, అహ్మదాబాద్, గుజరాత్, భారతదేశం) ఒక భారతీయ పారిశ్రామికవేత్త మరియు ప్రపంచ సమ్మేళన సంస్థ అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు.
Read hindi news: hindi.vaartha.com
EPaper: https://epaper.vaartha.com/
Read Also: