“అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్(Iran) మిడిల్ ఈస్ట్ దేశాల మీద దాడులు చేస్తూ ఉండటంతో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్యారెల్ ముడి చమురు ధర 3.2 శాతం పెరిగి 80 డాలర్లకు చేరుకుంది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్‌జీ) ధరలు 30శాతం పెరిగాయి. పెట్రోలు ధరలు పెరిగితే దాని ప్రభావం ఆహారం, వ్యవసాయం, పారిశ్రామిక ముడి పదార్ధాలు, ఇంకా అనేక పెట్రోలు ధరలు పెరిగితే దాని ప్రభావం ఆహారం, వ్యవసాయం వాటిపై పడుతుంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుంది” అని సారాసిన్ అండ్ పార్ట్‌నర్స్‌లో చీఫ్ ఎకనమిస్ట్ సుబితా సుబ్రమణియం చెప్పారు. బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం తగ్గుతోంది. దీంతో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేట్లను తగ్గించింది. వడ్డీ రేట్లను ఇంకా తగ్గిస్తామని ఇటీవల సంకేతాలు ఇచ్చినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతమున్న 3.75 శాతాన్ని మార్చకపోవచ్చని భావిస్తున్నారు. “యుద్ధం రెండు లేదా మూడు వారాల్లో అగిపోతుందా లేదా అనేది మనకు తెలియదు. అలాగే ముడి చమురు నౌకల రవాణా ప్రభావం ఇంధన మార్కెట్లపై ఉంటుందా లేదా అనేది కూడా మనకు తెలియదు.
Read Also: West Asia War: పశ్చిమాసియాలో యుద్ధం.. LPG గ్యాస్ కొరత..రైతులకు నష్టం

గల్ఫ్ జలాల్లో నిలిచిపోయిన 150 ట్యాంకర్లు
హార్ముజ్(Hormuz) జలసంధి గుండా ప్రయాణించేందుకు బయల్దేరిన 150 ట్యాంకర్లు గల్ఫ్ జలాల్లో నిలిచిపోయాయి. చైనా, ఇరాన్ నౌకలు మాత్రమే ఈ మార్గం గుండా ప్రయాణిస్తున్నాయని నౌకల రాకపోకల్ని ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ కెప్లెర్ తెలిపింది. “ఇరాన్ బెదిరింపుల కారణంగా హార్ముజ్ జలసంధిని మూసివేశారు” అని కెప్లెర్ సంస్థ ప్రతినిధి హొమయోన్ ఫాలక్‌షాహి చెప్పారు. ఇరాన్, ఒమన్ సముద్ర సరిహద్దుల మధ్యలో ఈ జలసంధి ఉంటుంది. ఇది ఒక ఇరుకైన జలమార్గం. ఈ మార్గంలోకి ప్రవేశించే, బయటకు వచ్చే దగ్గర సుమారు 50 కి.మీ.ల వెడల్పు మాత్రమే ఉంటుంది. మధ్యలో ఒక దగ్గర అత్యంత ఇరుకైనచోట కేవలం 40 కి.మీల వెడల్పే ఉంది. అయితే, ఈ జలసంధి మధ్య భాగంలో మాత్రమే పెద్ద నౌకలు ప్రయాణించేందుకు వీలుగా సరిపడినంత లోతు ఉంటుంది. మారిటైమ్ నేవిగేషన్ చార్ట్‌లు (సముద్రయాన పటాలు) భారీ చమురు నౌకల కోసం సురక్షితమైన ఇన్‌బౌండ్ లేన్‌ను, అవుట్‌బౌండ్ లేన్‌ను, ఈ రెండింటి మధ్య బఫర్ జోన్‌ను నిర్దేశించాయి. మొత్తంగా చూస్తే, కేవలం 10 కి.మీ వెడల్పు ఉండే మార్గం గుండానే భారీ నౌకలు ప్రయాణించాల్సి ఉంది. పర్షియన్ గల్ఫ్‌లోకి ఈ ట్యాంకర్లు ప్రవేశిస్తున్నప్పుడు ఇరాన్, అరబ్ దేశాలకు మధ్య వివాదాస్పద ప్రాంతాలైన గ్రేటర్, లెస్సర్ తుంబ్ దీవులకు సమీపంగా వెళ్తాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: