ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. అతడిని నిలువరించలేక ఇంగ్లండ్ ఆటగాళ్లు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగో రోజు ఆటలో భాగంగా గిల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్న సమయంలో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ అతడితో జరిపిన సరదా సంభాషణ స్టంప్ మైక్‌లో రికార్డైంది. ఈ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.భారత్ ఆధిక్యం 450 పరుగులకు చేరువవుతున్న తరుణంలో “కెప్టెన్, 450 పరుగుల వద్ద డిక్లేర్ చేసేయండి. రేపు మధ్యాహ్నం వర్షం పడుతుంది” అని బ్రూక్ (Harry Brook) అనడం వినిపించింది. దీనికి గిల్ నవ్వుతూ, “అది మా దురదృష్టం” అని బదులిచ్చాడు. అంతటితో ఆగకుండా బ్రూక్, “అయితే మ్యాచ్‌ను డ్రాగా ముగించుకోండి” అని మరో సలహా ఇచ్చాడు. ఈ సరదా వాగ్వాదం మైదానంలో నవ్వులు పూయించింది.
ఇన్నింగ్స్
ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు చేసిన గిల్, రెండో ఇన్నింగ్స్‌లోనూ కేవలం 162 బంతుల్లో 161 పరుగులు సాధించి భారత జట్టుకు భారీ స్కోరు అందించాడు. చివరి సెషన్‌లో భారత్ 427/6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి, ఇంగ్లండ్ (England) కు 608 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది.భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. క్రీజు (Crease) లో హ్యారీ బ్రూక్ (15), ఓల్లీ పోప్ (24) ఉన్నారు.ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేయాలంటే, చివరి రోజు భారత్ మరో 7 వికెట్లు పడగొట్టాల్సి ఉంది. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 556 పరుగులు అవసరం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Neeraj Chopra: NC Classic 2025లో నీరజ్ చోప్రా విజయం