టెక్ రంగ దిగ్గజం మైక్రోసాఫ్ట్ షేర్ మార్కెట్‌లో(Global Market) ఒక్కరోజులో భారీ నష్టాన్ని ఎదుర్కొంది. కొన్ని గంటల వ్యవధిలోనే కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 12 శాతం మేర తగ్గిపోయింది. దీని వల్ల మైక్రోసాఫ్ట్ వాల్యుయేషన్ 400 బిలియన్ డాలర్లకు పైగా క్షీణించింది.
Read Also:Gold rate record : రూ.2 లక్షలకు బంగారం! సామాన్యుడికి మరింత దూరమా?

స్టాక్ మార్కెట్ చరిత్రలో అరుదైన ఘటన
ఈ నష్టం భారతీయ కరెన్సీ విలువలో సుమారు రూ.36 లక్షల కోట్లకు సమానమవుతుంది. స్టాక్ మార్కెట్(Global Market) చరిత్రలో ఒకే రోజులో నమోదైన నష్టాల్లో ఇది రెండో అతిపెద్దదిగా విశ్లేషకులు చెబుతున్నారు. గత సంవత్సరం జనవరిలో ఎన్విడియా ఒక్కరోజులో 593 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ షేర్లలో చోటుచేసుకున్న ఈ అకస్మాత్తు పతనం గ్లోబల్ మార్కెట్లలో చర్చనీయాంశంగా మారింది.
మైక్రోసాఫ్ట్ షేర్లలో జరిగిన ఈ భారీ పతనంతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా టెక్ స్టాక్స్‌పై ఆధారపడిన ఫండ్స్‌పై ప్రభావం పడినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. షేర్ల అమ్మకాలు ఒక్కసారిగా పెరగడంతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి.
నష్టాలకు గల కారణాలపై విశ్లేషణ
వాల్యుయేషన్ పతనానికి గ్లోబల్ మార్కెట్ ఒత్తిళ్లు, పెట్టుబడిదారుల లాభాల స్వీకరణ, భవిష్యత్ ఆదాయ అంచనాలపై అనిశ్చితి వంటి అంశాలు కారణమై ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టెక్ రంగంపై పెరుగుతున్న పోటీ కూడా ప్రభావం చూపినట్లు చెబుతున్నారు. ఈ ఒక్కరోజు నష్టం ఉన్నప్పటికీ, మైక్రోసాఫ్ట్ యొక్క దీర్ఘకాలిక వ్యాపార బలం పటిష్టంగానే ఉందని కొందరు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. రాబోయే త్రైమాసిక ఫలితాలు కంపెనీ షేర్ దిశను నిర్ణయించే కీలక అంశంగా మారనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: