News Telugu: విజయవాడ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ట్రిపుల్ ప్లే ప్లాన్ ను అందిస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ జిఎం ఎం శేషాచలం తెలిపారు. కేవలం రు.400తో (అని పన్నులు కలుపి) ఇంటర్నెట్, టివి, ఫోన్ సదుపాయాలందిస్తామన్నారు. ఇటివి, మా టివి, జెమిని, జీ, తదితర ప్రముఖ చానల్స్ తో పాటు 9 ఓటిటి యాప్లు, దేశవ్యాప్తంగా అపరిమిత ఫోన్కాల్స్ ఉంటాయని, సమీపంలోని బిఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ లో, వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాలన్నారు. ప్రస్తుతమున్న బిఎస్ఎన్ఎల్ (BSNL) ఎఫ్టిటిహెచ్ కస్టమర్లు కేవలం రు.140కే టివి సేవలు పొందవచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో టివి సేవలందిస్తున్న లోకల్ కేబుల్ ఆపరేటర్లు ఇకపై బిఎస్ఎన్ఎల్తో కలిసి టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్టనర్గా నమోదు చేసుకోవచ్చన్నారు. కేబుల్ ఆపరేటర్ల మేళా బిఎస్ఎన్ఎల్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయాల్లో నిర్వహిస్తామన్నారు.
-రు.1కే ఫ్రీడం ప్లాన్:
ఆత్మనిర్బర్ భారత్లో భాగంగా 4జి సేవలను ప్రారంభించామని కేవలం రు.1కే ఫ్రీడం ప్లాన్ (Freedom plan for Rs. 1) ను కస్టమర్లకందిస్తామన్నారు. ఉచిత సిం, రోజుకు 2జిబి డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఇస్తామన్నారు. ముప్పై రోజుల చెల్లుబాటు వుంటుందన్నారు. ఈ సదుపాయాలన్ని కేవలం రు.1కే ఇస్తామన్నారు. ఈ ఆఫర్ ఎంఎన్పి పోర్ట్ ఇన్ కస్టమర్లకు కూడా వర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్లు రవికుమార్ బుంగ, ఎల్ శ్రీను, జనరల్ మేనేజర్లు మురళికృష్ణ, టి వెంకట ప్రసాద్, డిజిఎంలు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: