విజయవాడ : చేనేత కళాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో(AP) గత పది రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహించిన ఖాదీ మహోత్సవం ప్రదర్శన నేటితో విజయవంతంగా ముగిసిందని, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ రాష్ట్ర సంచాలకులు డా. ఎస్. గ్రీప్, సహాయ సంచాలకులు ఆర్.ఎల్.ఎన్. మూర్తి తెలిపారు. ప్రదర్శనకు నగర ప్రజల నుండి అనూహ్య స్పందన లభించడమే కాకుండా, విక్రయాల్లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయని తెలిపారు.
Read Also: Amaravati: హైవే నిర్మాణంలో ప్రపంచ రికార్డులు గర్వకారణం: సిఎం చంద్రబాబు

ఈ ప్రదర్శనలో వివిధ(AP) రాష్ట్రాలకు చెందిన ఖాదీ విక్రేతలు, చేనేత కార్మికులు తమ ఉత్పత్తులను ప్రదర్శనల ద్వారా దాదాపు రూ.2 కోట్ల 20 లక్షలకు పైగా అమ్మకాలు జరిగాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు గణనీయంగా పెరిగి, రికార్డు స్థాయి టర్నోవర్ను సాధించినట్లు తెలిపారు. ఈ ప్రదర్శన ముగిసినప్పటికీ, ఖాదీ ఉత్పత్తుల పట్ల ప్రజల్లో పెరిగిన ఈ ఆసక్తి భవిష్యత్తులో మన నేతన్నలకు మరింత ఉపాధిని కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముగింపు కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ కే. ప్రియాంక, పరిశ్రమల శాఖ జిల్లా మనేజర్ ఎం. మధు తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: