हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Latest News: America: భారత్ ను టారిఫ్ లు ఏమీ చేయలేవు: ఐఎంఎఫ్

Aanusha
Latest News: America: భారత్ ను టారిఫ్ లు ఏమీ చేయలేవు: ఐఎంఎఫ్

అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న ఆర్థిక, వాణిజ్య సవాళ్ల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ దృఢంగా ముందుకు సాగుతోంది. గ్లోబల్ ఎకానమీ మందగమనం, వాణిజ్య ఉద్రిక్తతలు, జియోపాలిటికల్ రిస్క్‌లు ఉన్నప్పటికీ భారతదేశం తన వృద్ధి దిశను నిలబెట్టుకుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF – International Monetary Fund) భారత్‌కు ఒక శుభవార్త అందించింది.

Read Also: Donald Trump: ఈ నెలాఖరులో ట్రంప్, కిమ్ భేటీ?

మంగళవారం విడుదల చేసిన తన ‘వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్ (World Economic Outlook)’ నివేదికలో IMF భారతదేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాను 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను 6.4 శాతం నుంచి 6.6 శాతానికి పెంచినట్లు ప్రకటించింది. ఇది గ్లోబల్ స్థాయిలో అత్యధిక వృద్ధి రేటు సాధిస్తున్న దేశాల్లో భారత్‌ స్థానాన్ని మరింత బలపరిచింది.

భారత ఎగుమతులపై అమెరికా (America) భారీ సుంకాలను విధించినప్పటికీ, దేశీయంగా బలమైన పనితీరు కారణంగా ఈ అంచనాను సవరించినట్లు తన ‘వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్’ (World Economic Outlook’) నివేదికలో స్పష్టం చేసింది.2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసిందని, గత ఏడాది కాలంలో ఇదే అత్యధికమని ఐఎంఎఫ్ గుర్తు చేసింది.

America
America

ఇప్పుడు ఐఎంఎఫ్ కూడా అదే బాటలో

ముఖ్యంగా దేశంలో ప్రైవేటు వినియోగం బలంగా ఉండటమే ఈ వృద్ధికి ఊతమిచ్చిందని తెలిపింది. ప్రభుత్వం జీఎస్టీ (GST) సంస్కరణల ద్వారా వినియోగ వస్తువులపై పన్నులను తగ్గించడంతో దేశీయ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని, ఇది అమెరికా సుంకాల ప్రభావాన్ని అధిగమించడానికి సహాయపడుతుందని నివేదికలో పేర్కొంది.

ఇటీవలే ప్రపంచ బ్యాంకు సైతం భారత వృద్ధి అంచనాను 6.3 శాతం నుంచి 6.5 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐఎంఎఫ్ (IMF – International Monetary Fund) కూడా అదే బాటలో పయనించడం భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతను సూచిస్తోంది.ఈ సందర్భంగా ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జియేవా భారత్‌పై ప్రశంసలు కురిపించారు.

మారుతున్న ప్రపంచ ఆర్థిక క్రమంలో చైనా (China) వృద్ధి నెమ్మదిస్తుండగా, భారత్ ప్రపంచానికి కీలకమైన వృద్ధి ఇంజిన్‌గా అభివృద్ధి చెందుతోందని ఆమె కొనియాడారు. అయితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా గడ్డు పరిస్థితుల నుంచి బయటపడలేదని, రాబోయే రోజుల్లో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. వర్ధమాన దేశాల వృద్ధి రేటు 2026 నాటికి 4 శాతానికి పరిమితం కావచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

ఆర్థిక సంక్షోభాన్ని బహిరంగంగా ఒప్పుకున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్

ఆర్థిక సంక్షోభాన్ని బహిరంగంగా ఒప్పుకున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్

📢 For Advertisement Booking: 98481 12870