ఎయిర్‌టెల్ సేవలకు సోమవారం అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎయిర్‌టెల్(Airel) యూజర్లు మొబైల్ డేటా(Mobile Data) సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే వాయిస్ సర్వీసెస్ కూడా పనిచేయలేదు. సాయంత్రం 4.04 PM గంటలకు 2300 మందికి పైగా యూజర్లు తమ సేవలకు అంతరాయం కలగడంపై ఫిర్యాదులు చేసినట్లు డౌన్‌డిటెక్టర్ పేర్కొంది. అయితే సేవలు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎయిర్‌టెల్ టెలికాం సంస్థ వెల్లడించింది.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై తీవ్ర అసంతృప్తి
చాలామంది యుజర్లు ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్‌గా మొబైల్ రీచార్జ్ చేసుకున్నప్పటికీ మొబైల్ డేటా రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనివేళల్లో ఇలా నెట్‌వర్క్‌కు అంతరాయం ఏర్పడంపై మండిపడుతున్నారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు తదితర ప్రాంతాల్లో యూజర్లు సిగ్నల్స్ రాకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎయిర్‌టెల్ CEO ఎవరు?
ఎయిర్‌టెల్ MD, CEOగా శశ్వత్ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు; విట్టల్ ...
ఎయిర్‌టెల్ CEO శశ్వత్ శర్మ. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా ఉన్న గోపాల్ విట్టల్ నుండి ఆయన ఆ బాధ్యతలను స్వీకరించారు. ఈ నిర్వహణ మార్పు జనవరి 2026 నుండి అమలులోకి వచ్చింది.
ఎయిర్‌టెల్ చరిత్ర ఏమిటి?
ఎయిర్‌టెల్ లోగో మరియు చిహ్నం, అర్థం, చరిత్ర, PNG, బ్రాండ్
ప్రస్తుతం ఒక ప్రధాన ప్రపంచ టెలికమ్యూనికేషన్ సంస్థ అయిన భారతి ఎయిర్‌టెల్, 1995లో భారతి టెలి-వెంచర్స్ లిమిటెడ్‌గా ప్రారంభమైంది.
Read more: hindi.vaartha.com
Read Also: