ఛత్తీస్‌గఢ్ (Chattishgarh)రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో (Bijapur district) మావోయిస్టుల (Maoists) లొంగిపోయారు.. పోలీసు వర్గాల ప్రకారం, మొత్తం 13 మంది మావోయిస్టులు తమ హింసాత్మక మార్గాన్ని విడిచిపెట్టి అధికారులకు లొంగిపోయారు. ఇందులో 8 మంది మహిళలు ఉండటం గమనార్హం. లొంగిపోయిన మావోయిస్టులపై రూ.23 లక్షల రివార్డు ఉందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి పునరావాసం కల్పిస్తామని అధికారులు తెలిపారు.

అజ్ఞాతం వీడుతున్నా మావోయిస్టులు
కగార్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’తో మావోయిస్టులకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ఎన్‌కౌంటర్‌లలో కీలక నేతలు మరణించారు. ఈ నేపథ్యంలో కొందరు మావోయిస్టులు అజ్ఞాతం వీడుతున్నారు. పోలీసుల ముందు లొంగిపోతున్నారు.ఈ మావోయిస్టులు గతంలో పోలీసులపై దాడులు, మందుపాతులు పాతడం, ప్రభుత్వ ప్రాజెక్టులకు విఘాతం కలిగించడం వంటి కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు సమాచారం. ప్రభుత్వం మావోయిస్టులకు సంధానానికి ఇచ్చిన పిలుపుతో పాటు వదిలివేత పాలసీ (Surrender and Rehabilitation Policy) ప్రోత్సాహంతో వారు లొంగిపోయినట్లు తెలుస్తోంది.
లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాస పథకాల కింద శిక్షణ, జీవనోపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఇది బీజాపూర్ జిల్లాలో నక్సలైట్ ప్రభావం తగ్గించడంలో ఒక కీలకమైన ముందడుగు అని అధికారులు పేర్కొంటున్నారు.
Read Also:Bihar: దేశంలోనే మొదటిగా మొబైల్ యాప్ ఓటింగ్ ప్రారంభించిన బీహార్