हिन्दी | Epaper
అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్

Bunny Vas: అల్లు అరవింద్‌ని చూస్తే నాకు గాడ్‌ ఫాదర్‌ అనే ఫీలింగ్‌ వస్తుందన్న బన్నీ

Anusha
Bunny Vas: అల్లు అరవింద్‌ని చూస్తే నాకు గాడ్‌ ఫాదర్‌ అనే ఫీలింగ్‌ వస్తుందన్న బన్నీ

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గీతా ఆర్ట్స్‌ కుటుంబానికి అతి సమీపంగా ఉన్న వ్యక్తిగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి సన్నిహిత స్నేహితుడిగా బన్నీ వాసు (Bunny Vas) సినిమాల రంగంలో తనదైన ముద్ర వేస్తూ వస్తున్నారు. అల్లు అరవింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ సంస్థలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా గీతా ఆర్ట్స్‌ సబ్‌బ్రాండ్ అయిన GA2 పిక్చర్స్ బ్యానర్‌ ద్వారా చిన్న, మధ్యస్థాయికి చెందిన ప్రయోగాత్మక చిత్రాల నిర్మాణంలో ప్రముఖంగా కనిపిస్తున్నారు. ‘BV వర్క్స్’ అంటూ తన పేరు మీద మరో కొత్త నిర్మాణ సంస్థను స్థాపించారు. సప్త అశ్వ క్రియేటివ్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ‌ల‌తో క‌లిసి ‘మిత్ర‌ మండ‌లి’ అనే చిత్రాన్ని నిర్మించారు. తాజాగా మూవీ టీజర్ ను లాంచ్ చేసారు. ఈ సందర్భంగా బన్నీ వాసు పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

టీజర్‌ లాంచ్

‘మిత్ర‌ మండ‌లి’ సినిమాలో ప్రియ‌ద‌ర్శి, రాగ్ మ‌యూర్, ప్ర‌సాద్ బెహ‌రా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిహారిక ఎన్ఎమ్(Niharika NM) హీరోయిన్ గా టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన టీజర్‌ లాంచ్ ఈవెంట్ కు అల్లు అరవింద్‌ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. బన్నీ వాసు మాట్లాడుతూ తనను ఎంతగానో సపోర్ట్ చేసిన నిర్మాత అల్లు అరవింద్‌ కు థ్యాంక్స్ చెప్పారు. ఆయనతో పాటుగా డైరెక్టర్ అనుదీప్‌ కేవీ, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Bunny Vas: అల్లు అరవింద్‌ని చూస్తే నాకు గాడ్‌ ఫాదర్‌ అనే ఫీలింగ్‌ వస్తుందన్న బన్నీ
Bunny Vas

గాడ్‌ ఫాదర్‌

అల్లు అరవింద్‌, జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్‌, ఎస్కేఎన్ లకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. లైఫ్ లో నా పేరెంట్స్ కంటే ఎక్కువ సమయం అల్లు అరవింద్‌తోనే స్పెండ్‌ చేశాను. మా ఇంట్లో కంటే ఆయన ఇంట్లోనే ఎక్కువ రోజులు ఉన్నా. ఈ స్థాయికి ఎదిగిన మమ్మల్ని చూస్తే ఆయనకు కూడా ఎంత గర్వకారణంగా ఉంటుందో ఆయన్ని చూస్తుంటే మాకొక గాడ్‌ ఫాదర్‌ అనే ఫీలింగ్‌ వస్తుంది. మా లైఫ్ లో గాడ్‌ ఫాదర్‌ అనే దానికి ఆయనే సరైన నిర్వచనం. ఈ జీవితాన్ని ఇచ్చినందుకు,ఇంతటి సపోర్ట్ ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఆయన నేర్పించిన క్రమశిక్షణ వల్లే మేము ఈ స్థాయికి వచ్చాం. మా కోపమైనా ఆనందమైనా ఆయనతోనే” అని బన్నీ వాస్‌ తెలిపారు.

Read Also: Ahmedabad Plane Crash: అహ్మదాబాద్‌ ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం..సినీ ప్రముఖుల సంతాపం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870