కొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్ల బంద్ వివాదం తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. ఎగ్జిబిటర్లు తమ సమస్యలు పరిష్కరించకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేయనున్నట్లు ప్రకటించడంతో, పరిశ్రమలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇండస్ట్రీ పెద్దలను ఉద్దేశించి ఆయన రాసిన లేఖపై సినీ పరిశ్రమలో గట్టిగానే చర్చ జరిగింది.పవన్ చెప్పింది కరెక్టేనంటూ ఇండస్ట్రీలోని కొందరు నిర్మాతలు ఆయనకు మద్దతు పలికారు.
తినుబండారాల ధరలు
ఈ నేపథ్యంలోనే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌తో సమావేశమైన పవన్ సినిమా టికెట్ ధరల కంటే సినిమా థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, మంచి నీళ్ల సీసాల ధరలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని చర్చించారు. ఈ నేపథ్యంలో థియేటర్లలో తినుబండారాల ధరలు, విక్రయాలు, నాణ్యతా ప్రమాణాలపై అధికారులు పర్యవేక్షణ జరిపి నియంత్రణ చేపట్టాలని ఆదేశించారు. స్నాక్స్, కూల్‌డ్రింక్స్ ధరలు తగ్గిస్తే థియేటర్లకి ప్రేక్షకులు ఎక్కువగా వస్తారని, తద్వారా పన్ను ఆదాయం కూడా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
మన వ్యాపారాన్ని
ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీ సమస్యలపై ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తన అభిప్రాయాన్ని తెలుపుతూ శుక్రవారం ట్వీట్ చేశారు. ‘ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు. ప్రేక్షకులను తిరిగి థియేటర్ల(Theatres)కు రప్పించడం ఎలా అని ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావుల నాది పావలా అని కొట్టుకోవడం కాదు మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలి తప్ప అలాగే సినిమా విడుదలైన 28 రోజుల్లోపే OTTకి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే, రాబోయే నాలుగైదు ఏళ్లలో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి.
థియేటర్ ఓనర్స్
ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు రెండు సంవత్సరాలకో, మూడు సంవత్సరాలో ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు. ఈ రెండు మూడేళ్లలో చాలామంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. సింగిల్ స్క్రీన్స్ మూత పడినట్టైతే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్(Multiplex Theaters) అయితే పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు బన్నీ వాసు.
థియేటర్లకే వెళ్లడం
బన్నీ వాసు వ్యాఖ్యలకు కొందరు మద్దతిస్తుంటే మరికొందరు మాత్రం ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. పెద్ద హీరోలు రెండేళ్లలో మూడేళ్లకో సినిమాలు తీస్తుంటే ఎలా అని అడుగుతున్న మీరు మీ ఫ్రెండ్ అల్లు అర్జున్(Allu Arjun)ని ఎందుకు నిలదీయడం లేదని కొందరు నెటిజన్లు ప్రశ్నించారు. తాము గతంలో వారానికో సినిమా చూసేవాళ్లమని ఇప్పుడు టిక్కెట్ రేట్లతో పాటు స్నాక్స్, కూల్‌డ్రింక్స్ ధరలు పెంచేయడంతో థియేటర్లకే వెళ్లడం మానేశామని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి బన్నీ వాసు ట్వీట్ తెలుగు సినిమా ఇండస్ట్రీ సమస్యలపై మరోసారి చర్చకు దారితీసింది.
Read Also: Rana: ప్రస్తుతం ప్రతీది రాజకీయమేనన్న రానా