BRS supports the Congress resolution

కాంగ్రెస్‌ తీర్మానానికి బీఆర్‌ఎస్‌ మద్దతు

హైదరాబాద్‌: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారత రత్న ఇచ్చేందుకు కేంద్రానికి ప్రతిపాదన పంపాలని శాసన సభలో తెలంగాణ ప్రభుత్వం చేసిన తీర్మానానికి బీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు అసెంబ్లీలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. భారత రత్న పుస్కారం పొందేందుకు మన్మోహన్ సింగ్ పూర్తి అర్హులని కేటీఆర్ అన్నారు. తన సుధీర్ఘ రాజకీయ జీవితంలో నీతి, నిజాయితీగా మన్మోహన్ వ్యవహరించారని కొనియాడారు.

Advertisements

ఆయన ఓ నిరాడంబర మనిషి అని కీర్తించారు. మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో మాజీ సీఎం కేసీఆర్ కూడా ఏడాదిన్నర పాటు మంత్రిగా పని చేశారని గర్తు చేశారు. వాస్తవానికి మన్మోహన్ సింగ్ ప్రతిభను గుర్తించింది తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు కావడం గర్వకారణమని కేటీఆర్ అన్నారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ నాయకత్వంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగిందని తెలిపారు. ప్రజాస్వామిక ఉద్యమాలకు ఆయన అండగా నిలబడ్డారని కొనియాడారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. ఆర్థిక సంస్కరణల్లో ఏమాత్రం వెనక్కి తగ్గలేని అన్నారు. ఎన్ని నిందలు వేసినా.. ఆ స్థితప్రజ్ఞుడు వణకలేదు, తొణకలేదని కేటీఆర్ ప్రశంసించారు.

కాగా, దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఆయన చేసిన సేవలను సీఎం గుర్తు చేశారు. ఆర్థిక వేత్తగా, కేంద్రమంత్రిగా, ప్రధానిగా కీలక పదవుల్లో కొనసాగారని తెలిపారు. మన్మోహన్‌ సింగ్‌ హయంలోనే తెలంగాణ ఏర్పడిందని సీఎం పేర్కొన్నారు. ఆయన సేవలను గుర్తిస్తూ భారత రత్న ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.. 1991-96 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయన ఊపిరిలూదారని సీఎం వివరించారు.

Related Posts
చిలుకూరు ఆలయ అర్చకుడి దాడిపై పవన్ కళ్యాణ్ స్పందన
చిలుకూరు ఆలయ అర్చకుడి దాడిపై స్పందించిన పవన్ కళ్యాణ్

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. Read more

హిందీ భాష వల్లే..25 భాషలు కనుమరుగు : స్టాలిన్
Because of Hindi language..25 languages ​​are disappearing: Stalin

హిందీ భాష ఓ మాస్క్ అయితే, సంస్కృతం ఓ క‌నిపించ‌ని ముఖం చెన్నై: హిందీ భాష‌కు వ్య‌తిరేకంగా త‌మిళ‌నాడు త‌న పోరాటాన్ని ఉదృతం చేసింది. ఆ భాష‌ను Read more

KCR : జగ్జీవన్ రామ్ సేవలను స్మరించుకున్న కేసీఆర్
https://vaartha.com/fake-heart-doctor-busted-in-madhya-pradesh/national/466383/

KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధునిగా, భారత ఉప ప్రధానిగా, సామాజిక వివక్షకు Read more

15న పార్లమెంటులో ‘రామాయణం’ ప్రదర్శన
'Ramayana' performance

ఈ నెల 15న పార్లమెంటులో భారతదేశపు ప్రఖ్యాత మహాకావ్యమైన 'రామాయణం'ను ఆధారంగా తీసుకుని రూపొందించిన యానిమేటెడ్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. 'రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' Read more

×