చిలుకూరు ఆలయ అర్చకుడి దాడిపై స్పందించిన పవన్ కళ్యాణ్

చిలుకూరు ఆలయ అర్చకుడి దాడిపై పవన్ కళ్యాణ్ స్పందన

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. రంగరాజన్ పై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యానని వెల్లడించారు. రంగరాజన్ పై దాడి దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఇది ఒక వ్యక్తిపై కాదు ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా భావించాలని స్పష్టం చేశారు.

Advertisements
1719308485 1155
అయితే రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలంటూ వీరరాఘవ రెడ్డి అనే వ్యక్తి వ్యక్తి 20 ప్రైవేటు సైన్యంతో మూడ్రోజుల క్రితం ఆయన ఇంటింకి వెళ్లారు. రామరాజ్య స్థాపనకు సహకరించాలని కోరగా రంగరాజన్ నిరాకరకించాడు. దీంతో ఆయన వీరరాఘవ రెడ్డి అనుచరులు రంగరాజన్‌పై దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కన్నుకు తీవ్ర గాయమైంది. అనంతరం రంగరాజన్ మెయినాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.అయితే ప్రధాన నిందితుడు వీరరాఘవ రెడ్డితో సహా మరో ఐదుగురుని అదుపులోకి తీసుకున్నారు.పరారీలో ఉన్న మిగిలిన అనుచరుల కోసం గాలిస్తున్నారు.కాగా,వీరరాఘవ రెడ్డిపై 2015లోనే హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రామరాజ్యం పేరుతో తనకు ప్రత్యేక చట్టం ఉందని అతడు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నట్లు గుర్తించారు. కాగా, దాడి ఘటనను పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. వీరరాఘవ రెడ్డి అనే వ్యక్తి 20 మంది ప్రైవేటు సైన్యంతో తనతో పాటు తన కుమారుడిపై కూడా దాడి చేసినట్లు ఫిర్యాదు చేశాడు.

  "కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ ధర్మపరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తపిస్తున్నారు పోరాటం చేస్తున్నారు. రామరాజ్యం సభ్యులమని చెప్పి వెళ్లిన ఒక మూక రంగరాజన్ పై దాడి చేయడం వెనుక ఉన్న కారణాలు ఏమిటనేది పోలీసులు నిగ్గు తేల్చాలి. ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం రంగరాజన్ నాకు పలు విలువైన సూచనలు అందజేశారు.టెంపుల్ మూమెంట్ అనే కార్యక్రమం ఏ దశలో ప్రారంభించాల్సి వచ్చిందో తెలియజేశారు హిందూ ఆలయాల నిర్వహణ, ధర్మ పరిరక్షణపై ఆయన ఎంతో తపన పడుతున్నారు. రంగరాజన్ పై జరిగిన దాడిని ప్రతి ఒక్కరం ఖండించాలి. చిలుకూరు వెళ్లి రంగరాజన్ ను పరామర్శించి, అండగా ఉంటామని ఆయనకు భరోసా ఇవ్వాలని జనసేన తెలంగాణ విభాగానికి దిశానిర్దేశం చేశాను" అని పవన్ కల్యాణ్ వెల్లడించారు.టెంపుల్ మూమెంట్ అనే కార్యక్రమం ఏ దశలో వచ్చిందో తెలియచేశారు.ఆయనపై చోటు చేసుకున్న దాడి ప్రతి ఒక్కరు కందించాలి ఈ క్రమంలో చిలుకూరు వెళ్లి రంగరాజన్ పరామర్శించి అండగా ఉంటామని జనసేన పార్టీ తెలంగాణ విభాగానికి దిశానిర్దేశం చేశానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యణ్ పత్రిక ప్రకటన ద్వారా వెల్లడించారు.

Related Posts
కేటీఆర్‌పై కేసు నమోదు
KTR responded to ED notices

ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌పై ఏసీబీ కేసు న‌మోదు చేసింది. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1గా, ఐఏఎస్ ఆఫీస‌ర్ అర‌వింద్ కుమార్‌ను ఏ2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ న‌మోదు Read more

హాల్ టిక్కెట్ లేకున్నా పరీక్షలకు అనుమతించాలి: తెలంగాణ ఇంటర్ బోర్డు
intermediate exams

హాల్ టిక్కెట్ లేకున్నా విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డు ప్రకటించింది. తెలంగాణలో ఇంటర్ హాల్ టిక్కెట్ల జారీలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సీజీజీ పోర్టల్‌లో సాంకేతిక Read more

తెలంగాణ విద్యుత్ శాఖలో కొలువుల జాతర
new jobs notification in Te

తెలంగాణలో విద్యుత్ శాఖలో త్వరలోనే పెద్ద సంఖ్యలో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు డిస్కంలు సిద్ధమవుతున్నాయి. విద్యుత్ శాఖలో మొత్తం 3,260 పోస్టులను భర్తీ చేయాలని అధికారులు Read more

బాలికపై అత్యాచారం.. నిందితుడిని కొట్టి చంపిన గ్రామస్థులు
The girl was raped.. The vi

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామంలో జరిగిన దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామంలో ఓ బాలికపై జరిగిన అత్యాచారం, ఆ తర్వాత గ్రామస్థులు Read more

×