భారత్-పాక్ సరిహద్దుల్లో తెరుచుకున్న బ్రిడ్జి

Kaman Bridge: భారత్-పాక్ సరిహద్దుల్లో తెరుచుకున్న బ్రిడ్జి

భారత్, పాక్ దేశాల మధ్య ఉన్న కమాన్ వంతెనను 6 ఏళ్ల తర్వాత తొలిసారి తెరవడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. 2019లో పుల్వామా ఉగ్రదాడి అనంతరం మూసివేసిన ఈ కమాన్ వంతెనను.. తాజాగా శనివారం అధికారులు తెరిచారు. భారత్-పాక్ సరిహద్దుల్లో.. రెండు దేశాల మధ్య సంబంధాలకు కేంద్రంగా జీలం నదిపై ఉన్న కమాన్ వంతెన తెరవడం ఇప్పుడు గమనార్హం. జీలం నదిలో దూకి ఓ యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకోగా.. వారి మృతదేహాలను తిరిగి బయటికి తీసుకువచ్చేందుకు ఈ కమాన్ వంతెనను తాజాగా తెరిచారు. ఇక ఈ కమాన్ వంతెనను తెరవడం రాజకీయంగానే కాకుండా మానవతా చర్యగా అధికారులు పేర్కొంటున్నారు.

భారత్-పాక్ సరిహద్దుల్లో తెరుచుకున్న బ్రిడ్జి

ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్
ఈనెల 5వ తేదీన జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని బాస్గ్రాన్, కమల్ కోట్ గ్రామాలకు చెందిన ఓ యువకుడు, యువతి జీలం నదిలో మునిగిపోయినట్లు భారత సైన్యం తెలిపింది. 22 ఏళ్ల యువకుడు, 19 ఏళ్ల యువతి మృతదేహాలు జీలం నదిలో నీటి ప్రవాహం ధాటికి భారత సరిహద్దులు దాటి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లినట్లు వెల్లడించారు. అయితే జీలం నదిలో మునిగిపోయిన ఆ యువతీ, యువకుల మృతదేహాలను వెలికి తీసేందుకు ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. అయితే మొదటగా యువకుడి మృతదేహం భారత భూభాగం వైపు కనిపించింది.
యువకుడి శవాన్ని ఆర్మీ అధికారులు స్వాధీనం
అయితే ఆ యువకుడి మృతదేహాన్ని వెలికితీసే లోపే నీటి ప్రవాహంలో నియంత్రణ రేఖను దాటి అది అవతలి వైపునకు కొట్టుకుపోయింది. చివరికి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్-పీఓకేలోని చినారి సమీపంలో పాక్ భూభాగం వైపు కనిపించింది. అనంతరం ఆ ప్రాంతం నుంచి యువకుడి శవాన్ని ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి మృతదేహాలను సజావుగా తీసుకువచ్చేందుకు భారత్-పాక్ సైనిక అధికారులు ఒకరికొకరు సహకరించుకోవడం గమనార్హం.

Related Posts
ట్రంప్, మస్క్ కలసి పని చేయగలరా?
Donald Trump ,Elon Musk

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కార్యవర్గంలో టెస్లా సీఈఓ, ప్ర‌పంచ కుబేరుడు ఎలాన్ మస్క్ 'డోజ్‌' (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ)కు సారథ్యం వహిస్తున్న విష‌యం తెలిసిందే. Read more

Hindu Communities :మరోసారి మహారాష్ట్ర ముస్లిం సంఘాలను హెచ్చరించిన హిందూ సంఘాలు
Hindu Communities :మరోసారి మహారాష్ట్ర ముస్లిం సంఘాలను హెచ్చరించిన హిందూ సంఘాలు

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లా కుల్దాబాద్ ప్రాంతంలో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని వెంటనే తొలగించాలని విహెచ్‌పీ (విశ్వ హిందూ పరిషత్), భజరంగ్ దళ్ Read more

బస్సు టికెట్ ఛార్జీలను పెంచిన కర్ణాటక సర్కారు
బస్సు టికెట్ ఛార్జీలను పెంచిన కర్ణాటక సర్కారు

కర్ణాటకలో మహిళల ఫ్రీ బస్సుల వల్ల ఆర్టీసీకి మోయలేని భారం పడింది. దీనితో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న క్రమంలో తాజాగా బస్సు టికెట్ Read more

ఓటర్ కార్డు ఓటుకు గ్యారంటీ కాదు: ఈసీ
votar card

ఇటీవల జరిగిన ఎన్నికలపై పలు అనుమానాలకు తావు వున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓటర్ కార్డు ఉన్నంత మాత్రాన ఓటేసే హక్కు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *