వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైల్లో (Vande Bharat Express) ప్రయాణించిన వ్యక్తికి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. జూన్ 23న వారణాసి నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న 22415 నంబర్ వందే భారత్ రైలులో, సి-7 కోచ్‌లోని 76వ సీటు వద్ద పైకప్పు నుంచి నీరు కారడంతో (Vande Bharat roof leak soaks passengers) ప్రయాణికులు ఇబ్బందుల్లో పడ్డారు. సీట్లు, సామాన్లు తడవడంతో పాటు, ఏసీ కూడా పనిచేయకపోవడం వల్ల పరిస్థితి మరింత కష్టతరంగా మారింది. ఈ దృశ్యాలను ఓ ప్రయాణికుడు వీడియోగా తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా, అది వైరల్‌గా మారింది.
ప్రయాణికుడి ఫిర్యాదు – సోషల్ మీడియాలో స్పందన
దర్శిల్ మిశ్రా అనే ప్రయాణికుడు ఈ అనుభవాన్ని ‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ, వందే భారత్ రైలులో ఉన్న సమస్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిక టికెట్ ధర చెల్లించి ప్రయాణిస్తున్నప్పటికీ, నీరు కారడం, ఏసీ పనిచేయకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఫిర్యాదు చేశారు. పీఎన్ఆర్ నంబర్‌తో పాటు రైల్వే శాఖ, ఐఆర్‌సీటీసీ, మంత్రి అశ్విని వైష్ణవ్‌లను ట్యాగ్ చేస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైల్వే శాఖ స్పందన – సమస్యకు పరిష్కారం
ఈ వీడియో వైరల్ కావడంతో రైల్వే శాఖ అధికారికంగా స్పందించింది. సి-7 కోచ్‌లోని రిటర్న్ ఎయిర్ డక్ట్ నుంచి నీరు కారడం రిటర్న్ ఎయిర్ ఫిల్టర్, డ్రిప్ ట్రే డ్రెయిన్ రంధ్రాలు మూసుకుపోవడమే కారణమని వెల్లడించింది. ఈ మూసుకుపోయిన దూల మూలంగా ఏసీ నుంచి వచ్చే నీరు పేరుకుపోయి, ట్రైన్ బ్రేక్ వేయగానే ప్రయాణికుల దగ్గరకు వచ్చిందని వివరించారు. సమస్య గుర్తించి తగిన మరమ్మతులు చేపట్టామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ హామీ ఇచ్చింది.
Read Also : Rajnath Singh : త్రివిధ దళాధిపతికి కీలక అధికారాలు