हिन्दी | Epaper

Online mobile scam : ఆన్‌లైన్ ఫోన్ స్కాం, హైదరాబాద్‌లో గ్యాంగ్ అరెస్ట్

Sai Kiran
Online mobile scam : ఆన్‌లైన్ ఫోన్ స్కాం, హైదరాబాద్‌లో గ్యాంగ్ అరెస్ట్

Online mobile scam : తక్కువ ధరకే శాంసంగ్ మొబైల్ ఇస్తామని నమ్మించి, ఆన్‌లైన్ ద్వారా వినియోగదారులను మోసం చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రాజేంద్రనగర్, శంషాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో హైదర్‌గూడలోని కార్యాలయం నుంచి నిందితులను పట్టుకున్నారు. కర్ణాటకకు చెందిన విజయ్ కుమార్ ఈ మోసాలకు ప్రధాన సూత్రధారి అని పోలీసులు గుర్తించారు.

Read Also: Indane Gas New Booking Numbers: ఇండేన్ గ్యాస్ కొత్త బుకింగ్ నంబర్లు ఇవే!

Online mobile scam
Online mobile scam

ఈ గ్యాంగ్ టెలీకాలర్ల ద్వారా తక్కువ ధరలో ఫోన్ ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుని, తరువాత పార్శిల్‌లో బ్లూటూత్ స్పీకర్లు లేదా ఇతర తక్కువ విలువైన వస్తువులు పంపేవారని పోలీసులు తెలిపారు. గత ఐదేళ్లలో సుమారు 3,880 మందిని మోసం చేసినట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి నగదు, సిమ్ కార్డులు, ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870