हिन्दी | Epaper

Uttarakhand : లోయ‌లో ప‌డ్డ వాహ‌నం… 8 మంది మృతి

Sudheer
Uttarakhand : లోయ‌లో ప‌డ్డ వాహ‌నం… 8 మంది మృతి

ఉత్తరాఖండ్ (Uttarakhand ) రాష్ట్రంలోని పిథోరాగఢ్ జిల్లా మువాని ప్రాంతంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. యాత్రికులను తీసుకెళ్తున్న వాహనం నిబంధనలు లంగిచి అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొముగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 11 మంది ప్రయాణిస్తున్నారు.

సహాయ చర్యలతో అప్రమత్తమైన అధికారులు

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు మరియు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. లోయలో పడి ఉన్న మృతదేహాలను వెలికితీసేందుకు రక్షణ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. గాయపడినవారిని అత్యవసర చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతుంది

ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతోంది. వాహనం అదుపు తప్పడానికి కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. డ్రైవర్ నిర్లక్ష్యమా? లేక వాతావరణ పరిస్థితులా? అనే కోణాల్లో అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదం స్థానికంగా విషాదాన్ని నింపింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Read Also : Jagan : జగన్ పిటిషన్ పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870