हिन्दी | Epaper

మహారాష్ట్రలో వణుకు పుట్టిస్తున్న ‘జీబీఎస్’ వైరస్

Anusha
మహారాష్ట్రలో వణుకు పుట్టిస్తున్న ‘జీబీఎస్’ వైరస్

దేశంలో గులియన్ బారే సిండ్రోమ్ (GBS) కలవరపెడుతోంది. తొలుత మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌‌లో వెలుగులోకి వచ్చిన జీబీఎస్.. క్రమంగా మిగతా రాష్ట్రాలకు విస్తరిస్తుంది. ఉహించిన దానికంటే వేగంగానే ఇతర రాష్ట్రాలకు ఈ వ్యాధి వ్యాప్తిచెందుతోంది. క్రమంగా మహారాష్ట్రలో జీబీఎస్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర లో ప్రస్తుతం 163 మందికి ఈ వైరస్ నిర్దారణ కాగా.. ఒక్క పుణే జిల్లాలోనే 149 కేసులు ఉన్నాయి. తాజాగా, నాందేడ్‌లో జీబీఎస్ బారినపడి చికిత్స పొందూ 60ఏళ్ల వృద్ధుడు మృతిచెందాడు. దీంతో మొత్తం జీబీఎస్ మరణాలు సంఖ్య 5కు చేరింది.మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ.. ‘సోమవారం కొత్తగా ఐదుగురికి జీబీఎస్ నిర్దారణ అయ్యింది.. ఎటువంటి మరణం లేదు.. ఇప్పటి వరకూ 127 కేసులు నిర్దారణ అయ్యాయి.. అనుమానిత 163 కేసుల్లో పుణే నగరంలో 32, ఇటీవల పుణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తగా చేరిన గ్రామాల్లో 86, పింప్రి చించువాడలో 18, పుణే గ్రామీణ జిల్లాలో 19, ఇతర జిల్లాల్లో 8 మంది ఉన్నారు’ అని తెలిపారు. జీబీఎస్ బారినపడ్డవారిలో ఇప్పటి వరకూ 47 మంది కోలుకున్నారని చెప్పారు. మరో 47 మంది ఐసీయూలోనూ.. 21 మంది వెంటలేటర్‌పైన చికిత్స పొందుతున్నట్టు వివరించారు.

బ్యాక్టీరియా లేదా కలుషిత ఆహారంద్వారా ఈ సిండ్రోమ్‌ వ్యాప్తిచెందుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. జ్వరం, వాంతులు, ఒళ్లంతా తిమ్మిర్లు, విరేచనాలు, పొత్తి కడుపులో నొప్పి, నీరసం, కండరాల బలహీనత లాంటి లక్షణాలు జీబీఎస్ బాధితుల్లో కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే, ఇది కరోనా లాగా అంటువ్యాధి కాదని, ఒకరి నుంచి ఒకరికి సోకదని, అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటే చాలని అంటున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను కలిసి.. పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు .

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870