జాతర కోసం 4 వేలుపైగా ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు
హైదరాబాద్ : తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గిరిజన పండుగ మేడారం జాతరకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడపనుంది. (TG) జాతర కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగించాలని నిర్ణయించింది. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా ఆర్టిసి (TGSRTC) సుమారు 4వేలకు పైగా స్పెషల్ సర్వీసులు నడపనుంది. సాధారణంగా స్పెషల్ బస్సుల్లో ఉన్న ఛార్జీల కంటే అదనపు ఛార్జీలను వసూలు చేస్తారు.. అలాగే స్పెషల్ బస్సుల్లో ఎలాంటి మినహాయింపులు ఉండవు. కానీ ఈ ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆర్టీసి ప్రకటించింది.
Read also: N. Ramachandra Rao: మేధావులు, విద్యావంతులు బిజెపిలో చేరాలి

మహాలక్ష్మి పథకం కొనసాగింపుపై ఆర్టీసీ స్పష్టత
ఈ మేరకు (TG) జాతర స్పెషల్ బస్సులకు టికెట్ ధరలను ఖరారు చేస్తూ ఆర్టిసి ఓ ప్రకటన విడుదల చేసింది. వరంగల్, హనుమకొండ, హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మేడా రానికి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టిసి తెలిపింది. వరంగల్, హనుమకొండ నుంచి భక్తులు ఎక్కువ సం ఖ్యలో మేడారం జాతరకు వస్తారని అంచనా వేసిన అధికారులు.. అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో బస్సులు నడపాలని నిర్ణయించారు. వరంగల్, హనుమకొండ నుంచి మేడారానికి టికెట్ ధర బస్సుల ఆధారంగా రూ.250 నుంచి రూ.500 వరకు హైదరాబాద్ నుంచి మేడారంకు రూ.600 నుంచి రూ. 1,110 వరకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ స్పెషల్ బస్సుల్లోనూ మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లకు ‘మహాలక్ష్మి పథకం’ వర్తిస్తుందని ఆర్టీసి స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: