हिन्दी | Epaper

Latest News: Telangana Rains: తెలంగాణలో మళ్లీ వర్షం హెచ్చరికలు

Radha
Latest News: Telangana Rains: తెలంగాణలో మళ్లీ వర్షం హెచ్చరికలు

తెలంగాణ(Telangana Rains) రాష్ట్రంలో రాబోయే మూడు నుండి నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంపై 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో(Bay of Bengal) ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, తరువాత 48 గంటల్లో అది పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడవచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో ఆదివారం రోజున ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి వంటి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Read also: TG: మావోయిస్టులతో సంబంధాలు వెంటనే తెంచుకోవాలి: బండి సంజయ్

Telangana Rains

ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల సూచన

సోమవారం మరియు మంగళవారం రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు(Telangana Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం నాటికి ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల, వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. గడిచిన 24 గంటల్లో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు నమోదైనట్లు TGDPS (తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ) పేర్కొంది.

రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున వ్యవసాయదారులు, ప్రజలు వాతావరణ సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాయుగుండం బలపడితే, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

తెలంగాణలో ఎప్పుడు వర్షాలు పడతాయి?
ఆదివారం నుంచి మూడు నుండి నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఎన్ని జిల్లాలకు అలెర్ట్ జారీ చేశారు?
హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు

సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు

మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లంచం బండి బట్టబయలు

మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లంచం బండి బట్టబయలు

టీ20 వరల్డ్ కప్ బహిష్కరణ వివాదం, కోచ్ సలావుద్దీన్ ఫైర్

టీ20 వరల్డ్ కప్ బహిష్కరణ వివాదం, కోచ్ సలావుద్దీన్ ఫైర్

ఏఐ దెబ్బకు ఐదేళ్లలో 80 కోట్ల ఉద్యోగాలు మాయం!

ఏఐ దెబ్బకు ఐదేళ్లలో 80 కోట్ల ఉద్యోగాలు మాయం!

మహాలక్ష్మి ‘స్మార్ట్ కార్డులు’.. తొలుత ఇచ్చేది వారికే!

మహాలక్ష్మి ‘స్మార్ట్ కార్డులు’.. తొలుత ఇచ్చేది వారికే!

పెన్షన్ల తొలగింపు పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్లారిటీ

పెన్షన్ల తొలగింపు పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్లారిటీ

ట్రంప్ టారిఫ్ షాక్, అమెరికాకు ₹26 లక్షల కోట్లు ఆదాయం

ట్రంప్ టారిఫ్ షాక్, అమెరికాకు ₹26 లక్షల కోట్లు ఆదాయం

ఢిల్లీ AI సదస్సులో 8 ఏళ్ల బాలుడి ప్రసంగం ప్రపంచాన్ని ఆకట్టుకుంది

ఢిల్లీ AI సదస్సులో 8 ఏళ్ల బాలుడి ప్రసంగం ప్రపంచాన్ని ఆకట్టుకుంది

స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లకు స్టీమ్ రైస్ అందించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం

స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లకు స్టీమ్ రైస్ అందించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం

ఈరోజు నుండే సూపర్-8 సమరం

ఈరోజు నుండే సూపర్-8 సమరం

వెనక్కి తగ్గేది లేదంటున్న ట్రంప్

వెనక్కి తగ్గేది లేదంటున్న ట్రంప్

డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ డైలాగ్స్ పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ డైలాగ్స్ పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

📢 For Advertisement Booking: 98481 12870