తెలంగాణంలో సరస్వతీ నది పుష్కరాలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ పుష్కరాలకు సంబంధించిన పోస్టర్, వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను మంత్రులు ఆవిష్కరించారు. పుష్కరాలకు నిత్యం 50 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా.పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాల ని సూచన చేసారు. అదే విధంగా భక్తులకు పూర్తి సమాచారం అందుబాటులో ఉంచేందుకు యాప్ తో పాటుగా వెబ్ సైట్ ను ఆవిష్కరించారు. అదే విధంగా పుష్కరాల కోసం వచ్చే భక్తుల కోసంటెంట్ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు.తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వేదికగా సరస్వతీ నది పుష్కరాలు జరగనున్నాయి. వచ్చే నెల మే 15 నుంచి 26వ తేదీ వరకు ఈ పుష్కరాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యం సరస్వతి పుష్కరాల వెబ్ పోర్టల్‌ను ఆవిష్కరించిన శాఖ మంత్రి కొండా సురేఖ పోస్టర్‌ను విడుద చేశారు. పుష్కరాల యాప్‌ను మంత్రి శ్రీధర్ బాబు విడుదల చేశారు. గత ప్రభుత్వం యాదగిరి గుట్ట మినహా మిగతా దేవాలయాలను నిర్లక్ష్యం చేసిందంటూ బీఆర్ఎస్ నేతలపై సురేఖ మండి పడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేవాలయాల వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. రూ. వంద కోట్లు దాటిన ఆలయాలను పాలక మండలి కిందకు తీసుకువస్తామని ప్రకటించారు.
ప్రత్యేక హోమాలు
సరస్వతి పుష్కరాల కోసం రూ. 35 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని వివరించారు. ఇక 17 అడుగుల సరస్వతి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. పుష్కరాలు జరిగే 12 రోజులపాటు కాశీ నుంచి వచ్చిన పండితులతో ప్రత్యేక హోమాలు, హారతి నిర్వహిస్తామని తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు పుష్కరాల ఏర్పాట్లను వివరించారు. తెలంగాణలో కాళేశ్వరం త్రివేణి సంగమని గుర్తు చేశారు. గోదావరి, ప్రాణహితతో కలిసి సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని వివరిం రు. 2013లో సరస్వతి పుష్కరాలు జరిగాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సారి కూడా ఈ పుష్కరాలను చాలా గొప్పగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గురువు మిధున రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ సరస్వతి పుష్కరాలు వస్తాయన్నారు.

ప్రభుత్వం అంచనా
ఈ పుష్కరాలకు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నుంచి భారీగా భక్తులు తరలి వస్తారన్నారు. ప్రతీ రోజు లక్ష మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుందని చెపారు. ఈ పుష్కరాల కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ. 35 కోట్లు విడుదల చేశారన్నారు. ఈ పుష్కరాల కోసం వచ్చేసే భక్తుల కోసం వంద పడకల టెంట్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కాశీ నుంచి వచ్చే పురోహితులతోపాటు స్థానిక పురోహితులు కలిసి ప్రత్యేక హారతి, హోమాలు నిర్వహి రని వెల్లడించారు. కాళేశ్వరంలో 17 అడుగుల సరస్వతి ఏకశిలా విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 12 రోజులపాటు కాశీ నుంచి వచ్చే పండితులతో ప్రత్యేక హోమాలు, హారతులు నిర్వహించనున్నారు.