ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు మరోసారి వార్తల్లో నిలుస్తున్నాయి. అహ్మదాబాద్ నుంచి లండన్ (Ahmedabad-London Flight) వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా (Air India) AI159 విమానంలో తాజాగా సాంకేతిక లోపం తలెత్తింది. విమానం టేకాఫ్‌కి సిద్ధంగా ఉన్న సమయంలోనే ఈ లోపం గుర్తించడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెంటనే సర్వీసును రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అహ్మదాబాద్-లండన్ మార్గంలో ఎయిర్ ఇండియా ప్రమాదం
ఇందులో గమనించదగిన విషయం ఏంటంటే.. జూన్ 12న అహ్మదాబాద్-లండన్ మార్గంలోనే ఎయిర్ ఇండియా మరో విమానం కుప్పకూలి భారీ ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో కెప్టెన్ సుమీత్ సబర్వాల్ సహా 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అదే రూట్‌లో తొలిసారి బయలుదేరుతున్న AI159 ఫ్లైట్‌కి ఇలాంటి సాంకేతిక లోపం తలెత్తడం ప్రయాణికుల్లో ఆందోళన రేకెత్తించింది. ఇప్పటికే ఎయిర్ ఇండియా సంస్థపై ప్రజల్లో విశ్వాసం తగ్గుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులకు వరుసగా అంతరాయాలు
తాజా ఘటనతోపాటు, ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులకు వరుసగా అంతరాయాలు ఎదురవుతున్నాయి. టెక్నికల్ లోపాలు, ఎమర్జెన్సీ ల్యాండింగులు, సిబ్బంది సమస్యలు ఇలా అన్ని మిలిపి విమానయాన రంగంలో నిర్లక్ష్యం చర్చనీయాంశమవుతోంది. వాయుసేవలు వినియోగించే ప్రయాణికులు భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎయిర్ ఇండియా తాజా ఘటనపై పూర్తి వివరాలు, దీనిపై సంస్థ స్పందన కోసం ఇంకా వేచి చూడాల్సి ఉంది.
Read Also : Thug Life: కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమా విడుదలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్