हिन्दी | Epaper
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

ఏప్రిల్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

sumalatha chinthakayala
ఏప్రిల్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకోసం ముఖ్య గమనిక… 2025 ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించిన ఏప్రిల్ కోటాను జనవరి 18 నుంచి ఆన్ లైన్లో అందుబాటులో ఉంచింది. జనవరి 18 ఉదయం నుంచి 20 వ తేదీ వరకూ రెండు రోజుల పాటూ ఆన్ లైన్లో నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్నవారంతా జనవరి 20 నుంచి 22 మధ్యాహ్నం లోగా డబ్బులు చెల్లించాలి. లక్కీ డిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తుంది టీటీడీ.

image
Srivari Arjitha Seva Tickets released for the month of April

.21 వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లు
.21 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు
.23వ తేది ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణం టిక్కెట్లు
.23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు
.23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు – వికలాంగుల దర్శన టికెట్లు
.24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు
.24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు కోటా
.27వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి సేవా కోటా విడుదల టిక్కెట్లు విడుదలవుతాయి
https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ నుంచి ఆర్జిత‌సేవ‌లు, దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870