తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) కులగణనపై తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అభినందనల లేఖ రాసినట్లు వెల్లడించారు. ఈ లేఖను తాను జీవితకాల అచీవ్‌మెంట్‌గా భావిస్తున్నట్లు తెలిపారు. “ఆ లేఖ నాకు ఆస్కార్ అవార్డు, నోబెల్ బహుమతితో సమానం” అని వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ నుండి వచ్చిన లేఖ తనకు ఎంతో ప్రేరణనిచ్చిందని రేవంత్ చెప్పారు.
తెలంగాణ కులగణన దేశానికి మోడల్
తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన కులగణనను దేశానికి ఒక ఆదర్శంగా నిలబెట్టే విధంగా తీసుకెళ్తామని సీఎం స్పష్టం చేశారు. “తెలంగాణ మోడల్ ఆఫ్ క్యాస్ట్ సెన్సస్” అనే పేరుతో దీనిని పేర్కొనాలని, అదే అసౌకర్యంగా అనిపిస్తే “రేర్ మోడల్” (RARE: Revanth’s Approach for Real Equality) అని పిలవొచ్చని తెలిపారు. ఇది సామాజిక న్యాయం సాధనలో కీలకమైన అడుగు అని అన్నారు.
75 ఏళ్లలో ఎవరు ప్రయత్నించని పని తెలంగాణ చేసింది
స్వతంత్ర భారతదేశ 75 ఏళ్ల ప్రజాస్వామ్యంలో ఇప్పటివరకు ఎవరూ కులగణన చేపట్టలేదని, తెలంగాణ ఈ అంశంలో ముందడుగు వేసిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రతి వర్గానికీ సమానత్వం కోసం నిజమైన డేటా అవసరమని, కులగణన ద్వారా ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం సాధ్యమవుతుందని తెలిపారు. ఇది సామాజికంగా వెనుకబడ్డ వర్గాల హక్కుల కోసం చారిత్రక చర్యగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
Read Also : Telangana Secretariat : సచివాలయంలో ఊడిపడిన పెచ్చులు!