హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మునుపెన్నడూ లేని విధంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధర సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కేవలం ఒక్కరోజే కేజీ వెండిపై ఏకంగా రూ. 22,000 పెరగడం గమనార్హం. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 3,40,000 మార్కుకు చేరుకుంది. గత పది రోజుల్లోనే వెండి ధర ఏకంగా రూ. 65,000 పెరగడం చూస్తుంటే మార్కెట్‌లో వెండికి ఎంతటి డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. క్లీన్ ఎనర్జీ రంగంలో వెండి వినియోగం పెరగడం, అంతర్జాతీయంగా సరఫరా తగ్గడం వల్ల ఇన్వెస్టర్లు వెండిపై మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా అతి తక్కువ కాలంలోనే పెట్టుబడిదారులకు ఈ లోహం భారీ లాభాలను తెచ్చిపెట్టింది.
RRB: గ్రూప్-D పోస్టుల నోటిఫికేషన్ విడుదలకు సిద్ధం
వెండితో పాటు పసిడి కూడా తన పరుగును కొనసాగిస్తోంది. నేడు ఒక్కరోజే 24 క్యారెట్ల (శుద్ధ బంగారం) 10 గ్రాముల ధర రూ. 2,130 పెరిగి రూ. 1,48,370 వద్దకు చేరుకుంది. అలాగే, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ. 1,950 ఎగబాకి రూ. 1,36,000 పలుకుతోంది. పసిడి ధరలు త్వరలోనే 1.50 లక్షల మార్కును దాటుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ పెరగడం, అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు బంగారం ధరలకు రెక్కలు తొడుగుతున్నాయి.

ఈ భారీ ధరల పెరుగుదలకు ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువ క్షీణించడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (యుద్ధ వాతావరణం) నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన మార్గంగా భావించి బంగారం, వెండిపై పెట్టుబడి పెడతారు. దీనికి తోడు చైనా వంటి దేశాలు తమ నిల్వలను పెంచుకోవడం కూడా ధరల పెరుగుదలకు దారితీసింది. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో సామాన్య ప్రజలు ఆభరణాల కొనుగోలుకు వెనకడుగు వేస్తుండగా, మదుపర్లు మాత్రం పండగ చేసుకుంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com