हिन्दी | Epaper

Breaking News – CM Revanth : పేదలకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్

Sudheer
Breaking News – CM Revanth : పేదలకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్

తెలంగాణలో పేదల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా రేవంత్ సర్కార్ ఒక ముఖ్యమైన అడుగు వేసింది. ఏళ్ల తరబడి భూములను (Lands) సాగుచేసుకుంటూ కష్టపడి బతుకుతుంటున్న గిరిజన రైతులకు ఇప్పుడు శాశ్వత హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించిన ప్రకారం, సుమారు అర శతాబ్దం నుంచి సాగులో ఉన్న 4 వేల మంది గిరిజన రైతులకు కొత్తగా భూమి పట్టాలు ఇవ్వనున్నారు. దీంతో గిరిజనుల దీర్ఘకాలిక పోరాటానికి పూర్తి స్థాయి పరిష్కారం లభించనుంది.

నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో జరిగిన సమీక్షా సమావేశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి భూభారతి పైలట్ ప్రాజెక్ట్ కింద 23 వేల ఎకరాల్లో సర్వే పూర్తి చేశామని తెలిపారు. అందులో 12 వేల ఎకరాలను ప్రభుత్వ భూమిగా గుర్తించగా, వాటిలో 8 వేల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే 4 వేల ఎకరాలకు పాసుపుస్తకాలు ఉన్నప్పటికీ, మరో 4 వేల ఎకరాలకు కొత్తగా పాసుపుస్తకాలు జారీ చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా, సుమారు 3,000 మందికి పైగా వ్యక్తుల పేర్లతో ఉన్న 2,936 ఎకరాల బోగస్ పాసుపుస్తకాలను రద్దు చేసినట్లు వెల్లడించారు.

ఈ ప్రక్రియలో రెవెన్యూ, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీర్ఘకాలంగా భూములను సాగుచేస్తున్న పేదలకు, ముఖ్యంగా గిరిజన (Tribal ) రైతులకు న్యాయం జరగాలని ఆయన హితవు పలికారు. పట్టాలు లభించడం వల్ల రైతులకు కేవలం భూ హక్కులు మాత్రమే కాకుండా, రైతుభరోసా, బీమా వంటి పథకాల లబ్ధి కూడా లభిస్తుంది. వేలాది కుటుంబాలకు భవిష్యత్తుపై భరోసా ఏర్పడుతుంది. ఈ నిర్ణయం రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి మార్గదర్శకంగా నిలవనుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.

https://vaartha.com/raw-papaya-health-benefits-nutrition/more/cheli/549211/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

రేవంత్ రెడ్డిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అజారుద్దీన్

రేవంత్ రెడ్డిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అజారుద్దీన్

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

మెట్రో ప్రయాణికుల కోసం ర్యాపిడో సరికొత్త సేవలు

మెట్రో ప్రయాణికుల కోసం ర్యాపిడో సరికొత్త సేవలు

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

లొంగిపోలేదు అరెస్టయ్యాం.. దేవజి

లొంగిపోలేదు అరెస్టయ్యాం.. దేవజి

పెళ్ళికి నిరాకరించిందని.. యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్

పెళ్ళికి నిరాకరించిందని.. యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్

కిందపడి మరణించిన వృదురాలు..చేతులు తిన్న పెంపుడు పిల్లులు

కిందపడి మరణించిన వృదురాలు..చేతులు తిన్న పెంపుడు పిల్లులు

ఇందల్వాయిలో ప్రైవేటు బస్సు బోల్తా ఘటనలో అసలు ఏం జరిగిందంటే?

ఇందల్వాయిలో ప్రైవేటు బస్సు బోల్తా ఘటనలో అసలు ఏం జరిగిందంటే?

గ్యాస్ సిలిండర్ల తరలింపు వాహనాలకు పోలీసు బందోబస్తు

గ్యాస్ సిలిండర్ల తరలింపు వాహనాలకు పోలీసు బందోబస్తు

📢 For Advertisement Booking: 98481 12870