Ramayana movie update : భారీ పౌరాణిక ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ‘రామాయణ’ సినిమా గురించి కొత్త ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు Christopher Nolan ఈ చిత్రానికి ఫైనల్ ఎడిటింగ్‌లో భాగస్వామ్యం అవుతారనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
నిర్మాత నమిత్ మల్హోత్రాకు చెందిన డీఎన్ఈజీ (DNEG) సంస్థ, గతంలో నోలన్ తెరకెక్కించిన పలు హాలీవుడ్ చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించింది. దీంతో ఈ రెండు బృందాలు కలిసి పని చేసే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు నోలన్ తన తదుపరి చిత్రం ‘ది ఒడిస్సీ’ పనుల్లో నిమగ్నమై ఉన్నారని సమాచారం. అందువల్ల ఈ ప్రాజెక్ట్‌కు సమయం కేటాయిస్తారా? అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది.
ఈ సినిమాలో రాముడిగా Ranbir Kapoor, సీతగా Sai Pallavi నటిస్తున్నారు. రావణుడి పాత్రలో Yash కనిపించనున్నారు. హనుమంతుడిగా Sunny Deol, లక్ష్మణుడిగా Ravi Dubey నటిస్తున్నారు. ఈ స్టార్ కాస్టింగ్ ఇప్పటికే భారీ అంచనాలు పెంచుతోంది.
Read Also: Rohit Sharma: ఆ మ్యాచ్‌ను మించింది మరొకటి లేదు
ఇక ట్రైలర్‌ను జూలైలో జరిగే San Diego Comic-Con వేదికపై (Ramayana movie update) విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఇది నిజమైతే భారతీయ పౌరాణిక కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో భారీ ప్రచారం లభించే అవకాశం ఉంది.
‘రామాయణ’ను రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027లో విడుదల కానుంది. అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తుందా? అన్న ఆసక్తి నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: