ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ముఖ్యంగా అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
పైన పేర్కొన్న జిల్లాలతో పాటు, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీఎస్‌డీఎంఏ అంచనా వేసింది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రైతులు, ప్రజలు వాతావరణ శాఖ సూచనలను పాటించి, తదనుగుణంగా తమ పనులను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
తెలంగాణలోనూ వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల ఆగస్టు 9వ తేదీ వరకు తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రైతులు, ప్రజలు వాతావరణ మార్పులను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
Read ALso : Chiranjeevi : రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి