హైదరాబాద్ (Hyderabad) నగరంలో గురువారం తీవ్ర వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడటంతో రహదారులపై నీరు (Water) నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, బంజారాహిల్స్, అమీర్‌పేట, కూకట్‌పల్లి, మియాపూర్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.
రంగంలోకి GHMC సిబ్బంది
వర్షం కారణంగా రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు GHMC మరియు హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగారు. వర్షంలో తడుస్తూ కూడా సిబ్బంది మానహోల్స్, డ్రైనేజి లైన్లను తెరిచి, నీటిని మురుగు కాలువలలోకి పంపించే పనిలో నిమగ్నమయ్యారు. అత్యవసర సేవల విభాగాలపై GHMC ప్రత్యేక దృష్టి పెట్టింది. రోడ్లపై జమైన నీరు వెంటనే వెళ్లిపోవడంతో పాటు, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజలకు జాగ్రత్తల పిలుపు
వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. విద్యుత్ తీగలు తెగి పడే ప్రమాదం, నీటిలో కనిపించని మాన్హోల్స్ వంటివాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో GHMC హెల్ప్‌లైన్ నెంబర్లను ఉపయోగించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
Read Also : Vijay Devarakonda : డెంగ్యూ తో హాస్పటల్లో చేరిన విజయ్ దేవరకొండ..?