వినియోగదారులకు , రైతులకు శుభవార్త. ఏసీ(AC)లు, ట్రాక్టర్లు వంటి ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు వారాల్లో జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం జరగనుండగా, ఇందులో పలు వర్గాల ఉత్పత్తులపై ఉన్న పన్నులను పున:పరిశీలించే అవకాశముందని సమాచారం. ముఖ్యంగా వ్యవసాయ, గృహోపయోగ వస్తువులపై గవర్నమెంట్ సంయమన విధానాన్ని పాటించే సూచనలు ఉన్నాయి.
12% జీఎస్టీ స్లాబ్ తొలగింపు పై చర్చ
ప్రస్తుతం పలు ఉత్పత్తులపై 12 శాతం జీఎస్టీ (GST) వసూలు చేస్తుంటారు. అయితే, ఈ స్లాబ్‌ను పూర్తిగా తొలగించాలన్న ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనివల్ల కొన్ని ఉత్పత్తులు 5 శాతం లేదా 18 శాతం జీఎస్టీకి మారవచ్చు. గరిష్ఠంగా 12 శాతం జీఎస్టీ ఉన్న ఉత్పత్తులపై ఇది నేరుగా ప్రభావం చూపించనుంది.
ద్రవ్యోల్బణం తగ్గింపుకు మంచి పరిష్కారం
జీఎస్టీ తగ్గితే ఏసీలు, ట్రాక్టర్లు వంటి ప్రస్తుత కాలానికి అవసరమైన ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశముంది. దీని ద్వారా వ్యవసాయదారులకు తక్కువ ఖర్చుతో ట్రాక్టర్లు లభించవచ్చు. అలాగే సాధారణ వినియోగదారులకు గృహోపయోగ సామగ్రి మరింత సులభంగా అందుతుంది. ఆర్థిక నిపుణులు ఇది ద్రవ్యోల్బణం తగ్గింపుకు తోడ్పడే నిర్ణయమవుతుందని విశ్లేషిస్తున్నారు.
Read Also : AP : 21న ప్రైవేట్ కాలేజీల బంద్ కు పిలుపు