ప్రతి కోడి ఏ ఫారం నుంచి వచ్చిందో ట్రాక్ చేసేలా ప్రయోగం
విజయవాడ : చికెన్ వ్యాపారంలో అక్రమాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవడంతో పాటు, కొత్తగా లైసెన్సింగ్ విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ప్రతి చికెన్(Chicken)దుకాణానికీ లైసెన్స్ ఇవ్వాలి. ఏ ఫారం(ఫౌల్ట్రీ) నుంచి కోళ్ళు వచ్చాయి. దుకాణదారుడు వాటిని ఎవరికి అమ్మారు…అనే అంశాలను ట్రాక్ చేసేలా పకడ్బందీ వ్యవస్థను తీసుకురావాలి’అని మాంసాభివృద్ధి (Poultry) సంస్థ బోర్డు నిర్ణయించింది. విజయవాడలోని పశు సంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. వైకాపా హయాంలో జరిగిన మాంసం మాఫియా అక్రమాలను బయటకు తీసి, భాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సంస్థ చైర్మన్ చంద్ర దండు ప్రకాష్ నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో డైరెక్టర్లు ప్రవీణ, అజ్ముద్దీన్, పశు సంవర్థక శాఖ సంచాలకులు టి. దామోదర్ నాయుడు, సంబం ధిత అధికారులు పాల్గొన్నారు.
Read also: CM చంద్రబాబు, లోకేశ్ విదేశీ పర్యటనలు

రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ బోర్డు నిర్ణయాలు
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివీ… చికెన్,వ ఎటన్ దుకాణాలను క్రమబద్దీకరించడం,
మున్సిపాలిటీల్లో మాంసం దుకాణాలపై ఆకస్మిక దాడులు చేపట్టే అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవడం. గుర్తింపు పొందిన చికెన్ (Poultry) షాపుల నుంచే హోటళ్ళ నిర్వాహకులు మాంసం కొనేలా ప్రోత్సా హించడం. స్టెరాయిడ్లు వాటిని కోళ్ళ అమ్మకాలను పూర్తిగా నియంత్రించడంచికెన్ దుకాణాల వ్యర్థాలను తీసుకువెళ్ళి చేపలకు ఆహారంగా వాడుతున్న మాఫియాను అరికట్ట డంచికెన్ దుకాణాల వ్యర్థాలను సేకరించి ప్రజారోగ్యానికి ఇబ్బంది కల్గని రీతిలో డిస్పోజ్ చేయడం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: