हिन्दी | Epaper

రేపే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..

sumalatha chinthakayala
రేపే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..

రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్‌ స్థానాలకు ఎన్నికలు

హైదరాబాద్‌: ఉమ్మడి కరీంనగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌(ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌) రెండు ఎమ్మెల్సీ స్థానాలకు, నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం(ఉపాధ్యాయ) ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 27న పోలింగ్‌ జరుగనున్నది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగనున్నది. ఇప్పటికే ఆయా జిల్లాల పరిధిలో అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు. కాగా, మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసింది. కరీంనగర్‌ రెండు ఎమ్మెల్సీ స్థానాల నుంచి మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీలు ఉన్నారు. ఇందులో టీచర్‌ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది, నల్లగొండ టీచర్‌ ఎమ్మెల్సీ స్థానం నుంచి 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

రేపే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..

ప్రచారానికి తెర..

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. మొత్తంగా మూడు ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఉత్కంఠరేపుతున్నది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.. ఎవరి బలమెంత అన్న చర్చోపచర్చలు టీచర్లు, గ్రాడ్యుయేట్లలో జోరుగా సాగుతున్నాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఎవరూ గెలిచే అవకాశాల్లేవన్న ప్రచారమున్నది. ఈ నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓటు ఒకరికి వేస్తే.. ఎవరికి రెండు, మూడు, నాలుగో ప్రాధ్యాత ఓట్లు వేయాలన్న చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఎవరు మొదటిస్థానంలో ఉంటారు.. ఎవరు ముందుగా ఎలిమినేట్‌ అవుతారు.. ఎలిమినేట్‌ అయిన వారి రెండో, మూడో ప్రాధాన్యత ఓట్లను ఎవరికి బదలాయించాల్సి వస్తుందన్న అంచనాలు, చర్చలు హాట్‌హాట్‌గా జరుగుతున్నాయి. పోలింగ్‌కు ఒక్కరోజు మాత్రమే సమయం ఉండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు కొందరు అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పెళ్ళికి నిరాకరించిందని సైకో ప్రియుడి ఘోర నిర్ణయం

పెళ్ళికి నిరాకరించిందని సైకో ప్రియుడి ఘోర నిర్ణయం

పెంపుడు పిల్లులు కాదు పులులు.. వృద్ధురాలిని పీక్కుతిన్నాయి

పెంపుడు పిల్లులు కాదు పులులు.. వృద్ధురాలిని పీక్కుతిన్నాయి

ఇందల్వాయిలో ప్రైవేటు బస్సు బోల్తా ఘటనలో అసలు ఏం జరిగిందంటే?

ఇందల్వాయిలో ప్రైవేటు బస్సు బోల్తా ఘటనలో అసలు ఏం జరిగిందంటే?

గ్యాస్ సిలిండర్ల తరలింపు వాహనాలకు పోలీసు బందోబస్తు

గ్యాస్ సిలిండర్ల తరలింపు వాహనాలకు పోలీసు బందోబస్తు

వరి ఉత్పత్తిలో తెలంగాణ టాప్

వరి ఉత్పత్తిలో తెలంగాణ టాప్

మా చావుతోనైనా వర్సిటీ మారాలి

మా చావుతోనైనా వర్సిటీ మారాలి

పంచాయతీలకు గుడ్ న్యూస్ తెలిపిన మంత్రి సీతక్క

పంచాయతీలకు గుడ్ న్యూస్ తెలిపిన మంత్రి సీతక్క

తెలంగాణలో రూ. 84. 15 కోట్ల జీఎస్టీ స్కామ్?.. నిందితుడు అరెస్ట్!

తెలంగాణలో రూ. 84. 15 కోట్ల జీఎస్టీ స్కామ్?.. నిందితుడు అరెస్ట్!

రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే

రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్

ఉమ్మడి పుల్కల్ మండలంలో టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం

ఉమ్మడి పుల్కల్ మండలంలో టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం

ఇప్పపువ్వు సారా పై అసెంబ్లీలో చర్చిస్తాం: మంత్రి జూపల్లి

ఇప్పపువ్వు సారా పై అసెంబ్లీలో చర్చిస్తాం: మంత్రి జూపల్లి

📢 For Advertisement Booking: 98481 12870