हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

నేటి నుంచి పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప‌నులు

sumalatha chinthakayala
నేటి నుంచి పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప‌నులు

అమరావతి: ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో నేడు కీలక ఘట్టం ప్రారంభం కానుంది. నీటి నిల్వకు కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ఈరోజు నుంచి షురూ కానున్నాయి. ఇప్పటికే జర్మనీ మెషీన్లు వచ్చేశాయి. గరిష్ఠంగా 90 మీ. లోతు వరకు నదీగర్భాన్ని తవ్వి ప్లాస్టిక్ కాంక్రీట్‌తో గోడ నిర్మిస్తారు. ఈ కొత్త డయాఫ్రమ్ వాల్ 1396 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందం ఉంటుంది. కింది నుంచి ఒక్క చుక్క నీరు లీక్ కాకుండా కాపాడుతుంది. ఇది సగం పూర్తి కాగానే దీనికి సమాంతరంగా దీనిపైనే ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్ పనులు కూడా ప్రారంభంకానున్నాయి. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డ‌యాఫ్రం వాల్ కాంక్రీట్ నిర్మాణ ప‌నుల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది.

ఉదయం10 గంటల 19 నిమిషాలను నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. దెబ్బతిన్న పాత డయాఫ్రంవాల్‌కు 6 మీటర్ల ఎగువన 1.396 కిలో మీట‌ర్ల పొడ‌వున‌, 1.5 మీట‌ర్ల మందంతో కొత్త డ‌యాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టనున్నారు. దీనికోసం ప్లాస్టిక్ కాంక్రీట్-T5 మిశ్రమాన్ని వినియోగించనున్నారు. కనిష్ఠంగా 20 మీట‌ర్లు, గ‌రిష్ఠంగా 94 మీట‌ర్ల లోతు నుంచి నిర్మాణం చేపట్టనున్నారు. డయాఫ్రంవాల్‌ నిర్మాణాల్లో నైపుణ్యం ఉన్న బావర్‌ కంపెనీ ఈ పనులు చేపట్టనుంది. దీనికోసం 3 ట్రెంచ్ క‌ట్టర్లు, 3 భారీ గ్రాబ‌ర్లు, 3 డిశాండింగ్ యూనిట్లు వంటి భారీ యంత్రాలను జర్మనీ నుంచి తెప్పించారు.

image
Polavaram diaphragm wall construction works from today

డయాఫ్రంవాల్‌పైనే ప్రాజెక్ట్‌లో అత్యంత కీలకమైన ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యాం నిర్మించనున్నారు. దాదాపు 2 కిలోమీటర్ల పొడవైన ఈసీఆర్ఎఫ్ డ్యాం పూర్తయితే గోదావరి నీటిని రిజర్వాయర్‌లో ఒడిసిపట్టేందుకు వీలవుతుంది. మొత్తం ప్రాజెక్టు పూర్తయితే 194 టీఎంసీల మేర నీటిని నిల్వ చేయవచ్చు. గతంలో తెలుగుదేశం హయాంలోనే డయాఫ్రంవాల్‌ నిర్మించినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 2020 గోదావరి వరదలకు డయాఫ్రమ్ వాల్ మూడు చోట్ల దెబ్బతింది. ఇసుక కోతకు గురై అగాధాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వాటిని పూడ్చి, ఇసుకను వైబ్రో కాంపక్షన్ విధానం లో గట్టిపరిచి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపడుతున్నారు.

కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో భాగంగా మొత్తం 383 ప్యానెల్స్‌తో లక్ష క్యూబిక్‌ మీటర్లకు పైగా ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ మిశ్రమాన్ని వినియోగించనున్నారు. కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి 998 కోట్ల రూపాయల వ్యయం కానుంది. ప్రస్తుతం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు డయాఫ్రమ్ వాల్ స‌గం నిర్మాణం పూర్తయ్యాక సమాంతరంగా ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం ప‌నులను చేప‌ట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదిన్నరలోగా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూలు ఖరారు చేసింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870